ఢిల్లీ పోలీసుల సర్‌ప్రైజ్, మేరీ కోమ్ ఇంటికి కేక్, కుమారుడి బర్త్ డే సందర్భంగా.. పాట పాడి...
లాక్ డౌన్ వల్ల ఆంక్షలతో జీవనం కొనసాగుతోంది. ఈ సమయంలో బర్త్ డే, మ్యారేజ్ డే.. ఇతర వేడుకలు కూడా సింపుల్‌గా జరుపుకోవాల్సిందే. అయితే బాక్సర్, రాజ్యసభ ఎంపీ మేరీ కోమ్ కుమారుడి బర్త్ డే సందర్భంగా ఢిల్లీ పోలీసులు సడెన్ సర్ ఫ్రైజ్ ఇచ్చారు. ఇంటికి పెద్ద కేక్ తీసుకొచ్చారు. అంతేకాదు హ్యాపీ బర్త్ డే అంటూ పాట కూడా పాడారు. పోలీసులు ఇచ్చిన సర్ ప్రైజ్‌తో మేరీ కోమ్ ఫ్యామిలీ సంభ్రమాశ్చర్యాలకు గురైంది.
కేక్ తీసుకొచ్చి, పాట పాడిన వీడియో మేరీ కోమ్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. మీరే రియల్ కరోనా వారియర్స్ అంటూ పొగిడారు. ఆపత్కాలంలో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూన్నారని కొనియాడారు. ఈ సమయంలో కూడా తన చిన్న కుమారుడు ప్రిన్స్ కోసం కేక్ తీసుకొచ్చి... బర్త్ డే చేసినందుకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. మీకు సెల్యూట్ అంటూ పోస్ట్ చేశారు.

కరోనా వైరస్ తగ్గి సాధారణ స్థితి రావాలని మనమంతా కోరుకుంటున్నాం.. కానీ వైరస్ ఎవరికీ పూర్తిగా అర్థం కావడం లేదన్నారు మేరీ కోమ్. వైరస్ వల్ల వ్యవస్థలు స్తంభించిపోయాయి.. ఆటలు నిలిచిపోయాయన్నారు. వైరస్ కోసం వ్యాక్సిన్ కనుగొంటే.. పరిస్థితి మారుతోందని ఆమె చెప్పారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications