ఢిల్లీ మెట్రోలో తాగి పడిపోయిన కానిస్టేబుల్(వీడియో)
న్యూఢిల్లీ: బాధ్యత మరచిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. పట్టపగలే యూనిఫాంలోనే తప్పతాగి ఊగిపోయాడు. ఈ ఘటన దేశ రాజధానిలోని మెట్రో రైలులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ పోలీసు కానిస్టేబుల్ తప్పతాగి.. ఢిల్లీ మెట్రోరైలు ఎక్కాడు.
సోయి లేకుండా ఉన్న అతని టక్కు ఊడిపోయింది. కనీసం నిలబడలేని స్థితిలో రైలు బ్రేకు వేసినప్పుడల్లా పోల్‌ను పట్టుకుని వేలాడుతూ నానా గందరగోళం సృష్టించాడు. ఓసారి ఏకంగా రైల్లో కిందపడిపోవడంతో సహచర ప్రయాణికులు లేపి నిలబెట్టారు.
అతని వ్యవహారాన్నంతా ఓ ప్రయాణికుడు వీడియో క్లిప్ రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. 600 మంది దాన్ని షేర్ చేశారు.
మెట్రోరైలులో మద్యం సేవించినా, తమవెంట తెచ్చుకున్నా ప్రయాణికులను అనుమతించరాదనే నిబంధనలున్నాయి. అయితే అధికారులు మాత్రం కానిస్టేబుల్ విషయంపై తమకు సమాచారం లేదని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications