మాజీ సీఎంనే వదల్లేదు.. : కాక్రోచ్ నేతల సంగతి సరేసరి

దేశ రాజధాని అరెస్టులతో అట్టుడికిపోయింది. జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాల నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి ఆతిషి, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, సంజీవ్ ఝా సహా సుమారు 700 మందికి పైగా నిరసనకారులు ఉన్నారు.

ఎస్ఐఆర్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగా భారీగా తొలగించారని ఆరోపిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.. వారంతా. ప్రభుత్వ అండతో అధికార యంత్రాంగం ప్రజాస్వామ్య ప్రక్రియను నీరుగారుస్తోందని మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ ఎన్నికల ప్రధాన కమిషనర్ వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

Delhi Police Detain Hundreds of Protesters Including Ex CM Atishi at Jantar Mantar Internet Suspended

నిరసనకారులను జంతర్ మంతర్ వైపు పోనివ్వకుండా నిలువరించడానికి పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. నిరసనకు బయలుదేరిన ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను నార్త్ అవెన్యూ వద్దే పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ పోలీసులు బలవంతంగా తమను అరెస్టు చేశారని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ, ఐసా, ఎన్ఎస్‌యూఐ సంఘాల విద్యార్థులు అశోకా రోడ్డు వద్ద భారీగా గుమిగూడగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

తిరుమలలో వడ ప్రసాదాల తయారీ కోసం..
తిరుమలలో వడ ప్రసాదాల తయారీ కోసం..

ఆందోళన తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో నిరసన స్థలమైన జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనికి తోడు ఢిల్లీ మెట్రో అధికారులు కూడా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, జంతర్ మంతర్ సహా దాదాపు 12 మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల ప్రవేశాలు, నిష్క్రమణ మార్గాలను పూర్తిగా మూసివేస్తోన్నట్లు ప్రకటించారు.

ఆ సమయంలో హనుమాన్ చాలీసా పఠించా: స్మిత్ కు ప్రధాని మోదీ వీడియో కాల్
ఆ సమయంలో హనుమాన్ చాలీసా పఠించా: స్మిత్ కు ప్రధాని మోదీ వీడియో కాల్

ఢిల్లీ పోలీసుల తీరుపై ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి ఆయిషీ ఘోష్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలను కాపాడటంలో, నేరాలను అదుపు చేయడంలో విఫలమవుతున్న ఢిల్లీ పోలీసులు, నైతిక బాధ్యత వహించాల్సిన అధికారిని కాపాడటానికి మాత్రం వీధుల్లోకి వచ్చి లాఠీలు ఝళిపిస్తున్నారని విమర్శించారు. నిర్బంధాల ద్వారా తమ పోరాటాలను అణచివేయలేరని హెచ్చరించారు.

ప్రస్తుతం జంతర్ మంతర్ పరిసరాల్లో భారీ భద్రత మరియు హైఅలర్ట్ కొనసాగుతోంది. కేవలం ఢిల్లీలోనే కాకుండా జాతీయ స్థాయిలో పారదర్శక ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, విద్యాసంస్థల ప్రతినిధులు ఈ సమస్యపై మరింత ఉధృతంగా పోరాడుతామని ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం మరియు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+