మెడలో ప్లకార్డ్ తో బస్టాప్ లో మమత బెనర్జీ బైఠాయింపు- అరెస్ట్

దేశ రాజధానిలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ అవెన్యూ బస్టాప్ లో బైఠాయించి ధర్నా చేస్తోన్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు పలువురు తృణమూల్ నాయకులు అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనతో ఢిల్లీ పరిణామాలు మరింత వేడెక్కాయి.

కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై ఇండియా బ్లాక్, కాక్రోచ్ జనత పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించాయి. దీని తర్వాత కాక్రోచ్ జనత పార్టీ రంగంలోకి దిగింది. నేడు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో మమత బెనర్జీ కూడా పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రమే ఆమె కోల్ కత నుంచి ఢిల్లీ చేరుకున్నారు.

Delhi Police detained former CM Mamata Banerjee as she was protest against CEC Gyanesh Kumar

భద్రత కారణాలు, నిషేధాజ్ఞలు విధించినందున పోలీసులు ఆమెను జంతర్ మంతర్ వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సౌత్ అవెన్యూ బస్టాండ్ వద్ద ఆమె బైఠాయించారు. మెడలో సేవ్ డెమోక్రసీ అనే ప్లకార్డును ధరించి నిరసన తెలిపారు. ఆమెతో పాటు లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అభిషేక్ బెనర్జీ, పలువురు ఎంపీలు, ఇతర నాయకులు ఉన్నారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా వాహనంలోకి తరలించారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది.

నాటి ఎమర్జెన్సీ కంటే వరస్ట్..: మోదీ-షాలకు అడ్డదారుల్లో గెలిచారనే భయం: కేజ్రీవాల్
నాటి ఎమర్జెన్సీ కంటే వరస్ట్..: మోదీ-షాలకు అడ్డదారుల్లో గెలిచారనే భయం: కేజ్రీవాల్

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఏకపక్షంగా, పక్షపాతంతో వ్యవహరిస్తోన్నారని మమత బెనర్జీ మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను అధికార పక్షం దుర్వినియోగం చేస్తోందని, తటస్థంగా ఉండాల్సిన కమిషన్.. కేంద్ర ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులు ఒత్తుతోందని, ఈవీఎంలల్లో అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. సీఈసీ ఏకంగా ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మమతా బెనర్జీ నిర్బంధంతో జంతర్ మంతర్, సౌత్ అవెన్యూ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు, విపక్ష కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు కాలరాస్తోన్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+