మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు- బీజేపీ ఎంపీపై ఛార్జ్‌షీట్
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఢిల్లీ పోలీసులు ఆయనపై ఛార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆయనపై ఈ ఛార్జ్‌షీట్ నమోదయింది. పలు సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభకు ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. వరుసగా మూడుసార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు బ్రిజ్ భూషణ్‌పై వెల్లువెత్తాయి.

ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగించారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తమ నిరసనలను కొనసాగించారు. మహిళా ఖాఫ్ పంచాయతీని కూడా నిర్వహించడానికి సమాయాత్తం అయ్యారు అప్పట్లో.
వారి నిరసనలు, ఆందోళనలకు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. పంజాబ్, హర్యానా సహా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు ఢిల్లీకి చేరుకుని, వారికి అండగా నిలిచారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరగాలంటూ సచిన్ టెండుల్కర్, 1983 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టు సభ్యులు, పలువురు క్రీడారంగ ప్రముఖులు గళమెత్తారు.
ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తాజాగా ఢిల్లీ పోలీసులు తమ ఛార్జిషీట్‌ను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో దాన్ని దాఖలు చేశారు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 354, 354 ఏ, 354డీ కింద ఛార్జిషీట్‌ను రూపొందించారు. భారత రెజర్ల సమాఖ్య మాజీ అసిస్టెంట్ కార్యదర్శి వినోద్ తోమర్ పేరును కూడా ఇందులో జత చేశారు.
ఆయనపై ఐపీసీలోని 109, 354, 354 ఏ, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఢిల్లీ పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ ఈ కేసును వాదించనున్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఇదివరకే దాఖలైన పోక్సో కేసును సెక్షన్ 173 సీఆర్‌పీసీ కింద రద్దు చేయాలంటూ ఢిల్లీ పోలీసులు పటియాలా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు జూలై 4వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications