• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

lockdown:పనిచేయని ఫ్యాన్లు, నాణ్యతలేని భోజనం, దోమల స్వైర విహారం, వసతి గృహాల్లో కూలీల వెతలు...

|

లాక్‌డౌన్ వల్ల ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో సౌకర్యాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కనీస వసతులు లేకపోకవడంతో అక్కడున్న వారు నరక అనుభవిస్తోన్నారు. ఢిల్లీలోని మంజు కా టిల్లా, పొష్ సివిల్ లైన్స్‌లో గల రెండు వసతి గృహాలను పోలీసు అధికారులు సందర్శించారు. అక్కడి పరిస్థితులపై పరిశీలించే క్రమంలో సంచలన నిజాలు వెలుచూశాయి.

ఫ్యాన్లు ఉన్నా...

ఫ్యాన్లు ఉన్నా...

ఆ రెండు వసతి గృహాల్లో ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదు. అసలే వేసవి కాలం.. ఉక్కపోయకుండా కనీస అవసరం ఫ్యాన్.. కానీ అదీ కూడా లేకుండా గడపాల్సి వస్తోంది. అక్కడున్న వారు ఉపయోగించి టాయిలెట్లను క్లీన్ చేయడం లేదు. ఎక్కువమంది ఉండటంతో దుర్గందం వెదజల్లుతోంది. అంతేకాదు ఆహారం కూడా నాణ్యత లేనిది పెడుతున్నారని చెబుతూ వలసకూలీలు వాపోయారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్ కాదు కదా.. హ్యాండ్ వాష్ కూడా లేదు. టాయిలెట్లలో ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే నీరు వస్తోందని.. తర్వాత రావడం లేదని వాపోయారు.

ఒకే సబ్బు..

ఒకే సబ్బు..

స్నానం చేసేందుకు అందరికీ ఒకే సబ్బు ఇస్తున్నారని.. బట్టలు పిండేందుకు సబ్బులు లేవని పేర్కొన్నారు. ఇక రాత్రిపూట తమపై దొమలు దండయాత్ర చేస్తున్నాయని వెల్లడించారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే.. వసతి గృహ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించారని వలసకూలీలు పోలీసు అధికారులకు వివరించారు. దీంతో తాము చూసిన అంశాలను దక్షిణ డీసీపీ మోనిక భరద్వాజ్.. సెంట్రల్ కమిషనర్ నిధి శ్రీవాత్సవకు అందజేశారు. ఇలాంటి పరిస్థితులే మరో 15 వసతి గృహాల్లో ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా పరిపాలానా యంత్రాంగం దృష్టికి నిధి శ్రీవాత్సవ తీసుకెళ్లారు.

మంచినీరు కూడా లేదు

మంచినీరు కూడా లేదు

వసతి గృహాల్లో సమస్యలు తమ దృష్టికి రావడంతో.. వెంటనే నివేదిక రూపంలో అందించాలని ఆయా పోలీసు అధికారులను కోరామని.. వారు నివేదించి తమ పరిధిలో గల రెవెన్యూ సిబ్బందికి జాబితా అందజేశారని తెలిపారు. వారు జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపడంతో.. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే మేజిస్ట్రేట్ ఆయా రెవెన్యూ అధికారులతో మాట్లాడి.. సమస్య పరిష్కారం దృష్టిసారించాలని ఆదేశించారని పేర్కొన్నారు. లాహొరి గేట్ పోలీసు స్టేషన్ ఏరియాలో ఉన్న వసతి గృహంలో కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవని నివేదించడం ఆందోళన కలిగిస్తోంది.

నాణ్యత లేని ఆహారం..

నాణ్యత లేని ఆహారం..

వసతి గృహల్లో రోజుకు రెండుసార్లు భోజనం పెడుతున్నారని.. కానీ నాణ్యత లేదని పేర్కొన్నారు. దీంతో మంచి ఆహారం వలసకూలీలు తిరిగే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఆయా గృహాలో బెడ్లు దగ్గరగా ఉన్నాయని.. సోషల్ డిస్టన్స్ పాటించలేదని అంశం ఆందోళనకు గురిచేస్తోంది. లాక్ డౌన్ విధించడంతో ఇళ్లులేని వారిని కూడా వసతి కేంద్రాల్లోకి తీసుకెళ్లారని.. దీంతో సమస్య వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అక్కడ జనం పెరగడంతో మౌలిక వసతుల సదుపాయాల కల్పన కష్టంగా మారుతోందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

  Lockdown Lifting In AP || కరోనా వైరస్ వ్యాప్తిని ఎప్పటికీ కంట్రోల్ చెయ్యలేం : సీఎం జగన్

  English summary
  Fans not working, bad food in delhi migrant camps. problems were flagged by personnel from Civil Lines police station, which surveyed two shelters at Majnu ka Tilla and the posh Civil Lines.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X