విమెన్స్ డే నుంచి ప్రతి మహిళకూ 2,500- మోదీ బిగ్ స్టేట్‌మెంట్: అక్కడే ట్విస్ట్
Chandrababu: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరంలో దిగాయి. హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. కిందటి నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల పర్వం సైతం ముగిసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఈ ఎన్నికల బరిలో దిగారు. కల్కాజీ నుంచి ఆతిషి పోటీలో ఉన్నారు. అల్కా లంబా, పూజా బల్యాన్, రేఖా గుప్తా, పూనం శర్మ.. వంటి వివిధ పార్టీల మహిళ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.
కాగా- ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. గతంలో పార్టీ తరఫున విడుదల చేసిన మేనిఫెస్టో గురించి ప్రస్తావించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయదలిచిన హామీల గురించి పునరుద్ఘాటించారు. ఢిల్లీ ఆర్కే పురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఢిల్లీలో తమ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోనే కీలక హామీలన్నింటినీ అమలు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఫిబ్రవరి 8వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తాము అధికారంలోకి వస్తామని, సరిగ్గా నెల రోజుల్లో అంటే మార్చి 8వ తేదీన తొలి హామీ అమలు చేస్తామని అన్నారు.
8 फरवरी को दिल्ली में भाजपा की सरकार बनेगी, 8 मार्च को अंतरराष्ट्रीय महिला दिवस है, 8 मार्च तक, दिल्ली की बहनों के खातों में 2,500 रुपया पहुंचना शुरू हो जाएगा।
— BJP (@BJP4India) February 2, 2025
इतना ही नहीं, बहनों को सस्ता सिलेंडर भी मिलेगा और पाइप से गैस पहुंचाने का काम भी तेज होगा।
दिल्ली के बहनों के घर में… pic.twitter.com/f034hIWFY3
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8వ తేదీన ఢిల్లీలోని అర్హులైన ప్రతి మహిళకూ 2,500 రూపాయలు అందుతాయని మోదీ పేర్కొన్నారు. వార్షిక ఆదాయం 12 లక్షల వరకు ఉన్న వేతన జీవులకు పన్నుల నుంచి మినహాయించిన విషయాన్ని ప్రస్తావించారు.
జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో దేశంలో 12 లక్షల జీతం తీసుకునే వాళ్లు ఒక వంతు పన్ను చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇందిరా గాందీ ప్రభుత్వం ఉంటే 10 లక్షల రూపాయలు పన్ను రూపేణా కట్టాల్సి ఉండేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చేంత వరకూ కూడా 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్లు 2,60,000 రూపాయలను కట్టేవాళ్లని గుర్తు చేశారు.
ఈ దఫా తాము 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్లు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా పన్నుల రూపంలో చెల్లించాల్సిన పని లేదని, తమ ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబీలకు సంక్షేమానికి కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నారు. అందుకే- ఢిల్లీలో అధికారంలోకి వస్తే మార్చి 8వ తేదీ నుంచీ మహిళలకు 2,500 రూపాయలు చెల్లిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications