వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేలాడుతోన్న శవాలు, కొట్టుకుపోయిన ఇండ్లు.. దేశ రాజధానిలో వరద బీభత్సం.. 3 గంటల్లో రికార్డు వర్షపాతం..

|
Google Oneindia TeluguNews

రాత్రి పూట బస్సులు, ట్రక్కుల్లో నిద్రపోయిన డ్రైవర్లు, క్లీనర్ల బతుకులు తెల్లారిపోయాయి.. ఫుట్ పాత్ లపై నిద్రించిన పేదలు అల్లకల్లోలం అయిపోయారు.. మురికివాడల్లో మురుగు కాలువల పక్కనున్న ఇళ్లు కొట్టుకుపోయాయి.. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే దేశరాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు తోతట్టుప్రాంతాు పీకల్లోతు నీటిలో మునిగిపోయాయి..

Recommended Video

Delhi Rains: Watch Building Collapsed | Minto Bridge కిందుగా కొట్టుకొచ్చిన మృతదేహం || Oneindia

దేశరాజధాని ఢిల్లీ, శివారు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. తక్కువ సమయంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వరద ఉప్పొంగడంతో రోడ్లు, నివాస ప్రాంతాలు జలమయం అయ్యాయి. రిడ్జ్ ప్రాంతంలో అత్యధికంగా 8.6 సెంటీమీటర్లు, లోథి రోడ్డులో 8.1, సఫ్దార్ గంజ్ లో 7.5, పాలంలో 3.8 సె.మీ వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో రక్షణ చర్యలు చేపట్టే వీలు లేకుండా పోయింది.

జగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధజగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధ

 delhi rains: national capital receives heavy rain and flood, several died, washing away houses

ప్రఖ్యాత ఐటీవో సమీపంలోని అన్నా నగర్ మురికివాడలో ఓ నాలా ఉప్పొంగి పొర్లడంతో పక్కనే ఉన్న ఇల్లులు వరదలో కొట్టుకుపోయాయి. న్యూఢిల్లీ యార్డులో నిలిపిన వాహనాల్లో నీటమునిగిన డ్రైవర్ల మృతదేహాలు వరదలో తేలాడుతుండగా వాటిని స్థానికులు వెలికి తీశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీ వర్షబీభత్సానికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వందలకొద్దీ ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

 delhi rains: national capital receives heavy rain and flood, several died, washing away houses

చారిత్రక మింటో బ్రిడ్జి మరోసారి వరదలో మునిగిపోయింది. ఢిల్లీ ట్రాన్స్ పోర్టు సర్వీసుకు చెందిన ఓ బస్సు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో ప్రయాణికులు ఊరిరాడక కకావికలం అయ్యారు. సమయానికి అగ్నిమాపక శాఖ రెస్క్యూ బృందాలు వచ్చి కాపాడటంతో అదరూ ప్రాణాలతో బయటపడ్డారు. బ్రిడ్రి కిందుగా మరో మృతదేహం కొట్టుకురాగా, అది ఆటోడ్రైవర్ దిగా గుర్తించారు. ప్రఖ్యాత మింటో బ్రిడ్జి గతంలో 1990లో ఓసారి, 2013లో మరోసారి నీటమునిగింది. నాటి ఫొటోలు, తాజా దృశ్యాలను కలిపి పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు.

ఢిల్లీలో భారీ వర్షం, వరద బీభత్సంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేశామని, మింటో బ్రిడ్జి వద్ద నీళ్లను తొలగించేశామని, ఇతర ప్రాంతాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. సహాయక చర్యల్లో ఆలస్యంపై బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. సీఎం కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Within three hours of heavy rainfall in Delhi, a portion of a road in the slum area of Anna Nagar near ITO caved in, washing away a house along with it. as of now 2 Dead As Heavy Rain Floods Roads In Delhi, Nearby Areas. A bus got stuck in a waterlogged road under Minto Bridge, rescue team saved passengers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X