Delhi riots:హైకోర్టుకు కింది కోర్టు షాక్ -విద్యార్థి నేతల విడుదలపై కొర్రీ -షూరిటీల ఎంక్వైరీ సాకుతో..
పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా గతేడాది ఢిల్లీలో జరిగిన నిరసనలకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సెషన్స్ కోర్టు విభేదించింది. వివాదాస్పద ఉపా చట్టాన్ని విద్యార్థులపై ప్రయోగించడాన్ని తప్పు పడుతూ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. కింది కోర్టు మాత్రం విద్యార్థి నేతల విడుదలపై కొర్రీలు వేసింది. వివరాలివి..
రాజ్యాంగం కల్పించిన 'నిరసన తెలిపే హక్కుకు', ఉగ్రవాద చర్యకు మధ్య తేడా ఉన్నదని వ్యాఖ్యానిస్తూ.. సీఏఏ నిరసనల్లో అరెస్టయిన ముగ్గురు విద్యార్థి నేతలు నటాషా నర్వాల్, దేవాంగన కలితా (జేఎన్‌యూ), అసిఫ్ ఇక్బాల్ తన్హా (జామియా మిలియా ఇస్లామియా) లకు ఢిల్లీ హైకోర్టు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. ఆ తీర్పునకు అనుగుణంగా తమను జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆ ముగ్గురూ బుధవారమే సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. కాగా,

హైకోర్టు బెయిల్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, నిందితులకు ష్యూరిటీలు పెట్టే వ్యక్తుల చిరునామాలు, ఇతర వివరాలను సేకరించడానికి కొంత సమయం పడుతుందని ఢిల్లీ పోలీసులు సెషన్స్ కోర్టుకు తెలిపారు. దీంతో సెషన్స్ కోర్టు జడ్జి రవీంద్ర బేడీ.. విద్యార్థి నేతల విడుదలను తాత్కాలికంగా నిలిపేశారు. పోలీసుల నుంచి వచ్చే వివరణను బట్టి గురువారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని జడ్జి పేర్కొన్నారు.
నటాషా, దేవాంగన, ఆసిఫ్ ఇక్బాల్ కు బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ''అసమ్మతిని అణచివేయాలనే ఆరాటంలో కేంద్రానికి.. రాజ్యాంగం హామీ ఇచ్చిన నిరసన తెలిపే హక్కుకూ, ఉగ్రవాద చర్యకు మధ్య ఉన్న తేడా మసకబారినట్టు అనిపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం. సాధారణంగా ఐపీసీ కిందకు వచ్చే నేరాలకు ఉగ్రవాద చర్య పేరుతో యూఏపీఏ చట్టాన్ని వర్తింపజేయరాదు. అతిశయోక్తి ప్రసంగాలు మినహా నిందితులపై మోపిన అభియోగాలు ఏవీ యూఏపీఏ కిందకు రావు'' అని జడ్జిలు పేర్కొన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications