మహిళా జడ్జీ వెంటపడిన దొంగలు.. అదును చూసి..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తినే వెంబడించారు. ఆమె కారు అద్దాలు పగలగొట్టి ఆమె పర్సు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని సాకేత్ కోర్టు అదనపు న్యాయమూర్తి గత మంగళవారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు.

Delhi Robbers Chase Woman Judge for 3 km, Lack of Police Presence

అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఆమె కారును వెంబడించారు. సరితా విహార్ అండర్ పాస్‌ సమీపంలోకి రాగానే.. కారు వెనుక భాగం విరిగిపోయిందని ఆ దుండగులు ఆమెకు సైగలు చేశారు. అయితే, ఆమె వారి మాటలు నమ్మకుండా డ్రైవింగ్ కొనసాగించారు.

ఓఖ్లా ప్రాంతంలో ఆమె కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగానే.. వెనుకే వస్తున్న దొంగలు ఆమె కారు అద్దాలు పగలగొట్టి.. ఆమె పర్స్ ఎత్తుకెళ్లారు. ఈ పరిణామంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి.. కళ్లముందే చోరీ జరుగుతున్నా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు.

ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా, దేశ రాజధానిలో ఓ మహిళా న్యాయమూర్తి పరిస్థితే ఇలావుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+