ఆప్ ఎమ్మెల్యేపై ఇంకుతో దాడి -యూపీ సందర్శకు వెళ్లిన ఢిల్లీ నేతకు చేదు అనుభవం -అరెస్టుస్కూళ్ల నిర్వహణ, విద్యా ప్
స్కూళ్ల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, ఆస్పత్రుల్లో సౌకర్యాల విషయంలో మేమంటే మేమే బెస్టంటూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధినేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఎమ్మెల్యే సోమనాధ్ భారతికి పొరుగురాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది.
యూపీలోని రాయ్‌బరేలీలో గల ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు వెళ్లిన సోమనాథ్ భారతిపై కొందరు యువకులు ఇంకు చల్లారు. ఆప్ ఎమ్మెల్యే యూపీ పర్యటన ఉద్రిక్తతకు దారితీయడంతో ఆయను వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు కోరగా.. తీవ్ర వాగ్వాదం చెలరేగింది. గొడవ జరుగుతుండగానే ఎమ్మెల్యేపై దుండగులు ఇంకు విసిరారు.

స్కూళ్లు, ఆస్పత్రులపై సవాళ్లను నిరూపించేందుకు ఆదివారమే యూపీకి వచ్చిన ఢిల్లీ ఎమ్మెల్యేను గెస్ట్ హౌజ్ నుంచి బయటికి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇందకు దాడి తర్వాత ఆప్ ఎమ్మెల్యేను అమేథికి తరలించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆస్పత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆప్ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది.
యూపీలో విద్యా, ఆరోగ్య సదుపాయాలపై ప్రశ్నిస్తున్న ఆమాద్మీ నేతలపై దాడులకు ఉసిగొల్పడం యూపీ ప్రభుత్వం నియంతృత్వం వైఖరికి నిదర్శనమని ఆమాద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు. సోమనాథ్ భారతిపై జరిగిన ఇంకుదాడి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.
ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై యూపీలో ఇంకుదాడి జరగడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. యూపీ స్కూళ్లను చూడ్డానికి వస్తే సీఎం యోగి ఎందుకు ''భయపడుతున్నారంటూ'' ఆయన దుయ్యబట్టారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications