పట్టపగలే కాల్పులు: కోర్టు ప్రాంగణంలో గ్యాంగ్‌స్టర్ దారుణహత్య

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: శనివారం ఢిల్లీలోని ఓ కోర్టు ప్రాంగణంలో విచారణకు వచ్చిన ఖైదీని దారుణంగా కాల్చి చంపారు. విచారణ నిమిత్తం రోహిణి కోర్టుకు తీసుకొచ్చిన గ్యాంగ్‌స్టర్‌ నీరజ్‌ బావనాను దుండగులు తుపాకులతో కాల్చి హతమార్చారు.

వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో విచారణ చేపట్టేందుకు శనివారం ఉదయం నీరజ్‌ను పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకొచ్చారు. ఇంతలో ఇద్దరు దుండగులు.. నీరజ్‌పై కాల్పులు జరిపారు.

Delhi's wanted gangster shot dead inside Rohini court premises

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నీరజ్‌ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందాడు. కాల్పులు జరిపిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య ఎందుకు చేశారో నిందితుల విచారణలో తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

కాగా, కిడ్నాప్‌లు, హత్యలు చేస్తూ గ్యాంగ్‌స్టర్‌గా మారిన నీరజ్‌ను 2015 ఏప్రిల్‌లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.ఇప్పటికే అతనిపై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A high-profile prisoner was on Saturday shot dead inside north Delhi Rohini court premises.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి