అఫ్ఘాన్ మహిళపై ఆస్పత్రి ఉద్యోగి లైంగిక దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ దేశానికి చెందిన 30ఏళ్ల మహిళపై ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలోని ఉద్యోగి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించింది బాధిత మహిళ. తన తల్లికి సహాయకంగా ఉంటున్న ఆ మహిళపై 21ఏళ్ల అమర్ సింగ్ అనే ఆస్పత్రి ఉద్యోగి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటన జులై 25న దక్షిణ ఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తన తల్లి వార్డులో తన సోదరితోపాటు నిద్రిస్తున్న సమయంలో బాధితురాలిపై ఈ దారుణానికి పాల్పడ్డాడు నిందితుడు.

‘నేను నా సోదరితోపాటు నిద్రిస్తున్న సమయంలో నిందితుడు మా వార్డుకు వచ్చి, నా ప్రైవేటు భాగాలను తాకాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. మెళకువ వచ్చి ఏడుస్తూ కేకలు వేశా. నా సోదరి కూడా అరిచింది. దీంతో సెక్యూరిటీ గార్డు వచ్చి నిందితుడ్ని పట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు' అని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది.
నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు మేజిస్టేట్ ముందు హాజరుపర్చగా, ఆగస్టు 8 వరకు జ్యూడిషియల్ కస్టడి విధించడం జరిగింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications