ఢిల్లీలో ఎన్‌కౌంటర్: కరుడుగట్టిన నేరస్తుడి అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నెహ్రూ మెట్రో స్టేషన్ వద్ద అక్బర్ అనే పాత నేరస్థుడిపై పోలీసులు కాల్పులు జరిపారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నెహ్రూ మెట్రో స్టేషన్ వద్ద అక్బర్ అనే పాత నేరస్థుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అక్బర్, అతడి అనుచరుడు కూడా పోలీసులపైకి ఎదురుకాల్పులు జరిపారు.

పోలీసుల కాల్పుల్లో అక్బర్ గాయపడటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్బర్ అనుచరుడు మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కేసుకోవడంతో గాయాల నుంచి తప్పించుకున్నారు. కాగా, పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న అక్బర్‌పై రూ.25వేల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications