డాక్టర్‌ను కొట్టిన మికాసింగ్, వీడియో హల్‌చల్, అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికా సింగ్‌ను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ కార్యక్రమంలో ఓ వైద్యుడిని చెంపదెబ్బ కొట్టి అవమానించారు. దీంతో, అతను పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
గత ఏప్రిల్ 12న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ప్రయివేటు ఫంక్షన్‌లో పాటలు పాడేందుకు వెళ్లిన మికా సింగ్ వేదిక పైన అంబేడ్కర్ ఆసుపత్రిలో అప్తమాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్ శ్రీకాంత్‌ను కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి.

ఈ ఘటన పైన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాఫ్తు చేశారు. తప్పు మికా సింగ్‌దేనని నిర్ధారించిన పోలీసులు, గురువారం అతనిని అరెస్టు చేశారు. మికా సింగ్ పైన మరో ఆరోపణ కూడా వచ్చింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కు రూ.27 లక్షలు చీటింగ్ చేసినట్లుగా కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications