ఫుట్‌పాత్‌పై ఉన్న ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు (వీడియో)

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని గులాబీ బాగ్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నిలబడి ఉన్న ముగ్గురు పిల్లలపైకి నియంత్రణ కోల్పోయిన ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడగా, మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన ఈ ఘటన వీడియోలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజీలో అదుపు తప్పిన కారు.. పుట్‌పాత్ ఉన్న ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. కారును అందులోని వ్యక్తి కొంత దూరం వెళ్లిన తర్వాత ఆపాడు.

 Delhi: Speeding Car Runs Over 3 Children In Gulabi Bagh Area.

అనంతరం కారులోంచి బయటికి వచ్చిన డ్రైవింగ్ చేసిన వ్యక్తిపై స్థానికులు దాడి చేశారు. అతడ్ని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. కారులోని వ్యక్తి పారిపోకుండా ప్రమాదం జరిగిన చోటుకు వస్తుండగా స్థానికులు అతడ్ని కొట్టారు.

కాగా, ఈ 30 ఏళ్ల డ్రైవర్ ప్రతాప్ నగర్ వాసి. కారుపై ప్రతాప్ నియంత్రణ కోల్పోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు.

డీపీపీ తెలిపిన వివరాల ప్రకారం.. పది, నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఆరేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.

ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, హర్యానాలో ఆదివారం తెల్లవారుజామున మరో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా, ఈరోజు తెల్లవారుజామున యమునానగర్‌లోని ఔరంగాబాద్ గ్రామ సమీపంలో కనీసం ఏడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు.

"10-15 వాహనాలు ఢీకొని ఉండవచ్చు కానీ ఇక్కడ మేము 7-8 వరకు గుర్తించాం. ఈ రోజుల్లో పొగమంచు ఎక్కువగా ఉన్నందున ప్రజలు నెమ్మదిగా వాహనాలు నడపాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+