Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బస్సులో డ్యాన్స్ బేబీ డ్యాన్స్.. డ్రైవర్, కండక్టర్‌ ఎంజాయ్.. చివరకు..!

ఢిల్లీ : టిక్‌టాక్ వీడియోల గోలేందిరా నాయనా అనుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. రోజుకో చోట టిక్‌టాక్ వీడియోలతో అడ్డంగా బుక్కవుతున్నవారి సంఖ్య పెరుగుతోనే ఉంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పనీపాటా మానేసి టిక్కుటాక్కు వీడియోలతో ఫోజులు కొట్టిన ఘటన వైరల్ కావడంతో చివరకు ఉన్నతాధికారులతో షంటింగ్ పడింది. ఆ క్రమంలో తాజాగా ఢిల్లీలో జరిగిన ఘటన కూడా చర్చానీయాంశంగా మారింది.

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన హరినగర్ డిపో బస్సులో ఓ లేడీ డ్యాన్స్ చేసిన ఘటన వివాదస్పదమైంది. ఆమె డ్యాన్స్ చేస్తుంటే వారించాల్సిన మార్షల్‌తో పాటు డ్రైవర్, కండక్టర్ అందరూ కలిసి ఎంజాయ్ చేశారట. దాంతో విషయం కాస్తా ఉన్నతాధికారుల ద‌‌ృష్టికి వెళ్లింది. ఆ క్రమంలో సదరు బస్సు నడుపుతున్న డ్రైవర్‌పై వేటు పడింది. అలాగే కండక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మార్షల్ ను మాత్రం సివిల్ డిఫెన్స్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Delhi transport staff dancing with girl in bus face action

వాస్తవానికి ఈ ఘటన గత నెల 12వ తేదీన జరిగింది. అనంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం కాస్తా బయటకొచ్చింది. ఓ పాటకు సదరు మహిళ డ్యాన్స్ చేస్తుంటే వారించాల్సిన డీటీసీ సిబ్బంది అలాగే చూస్తూ ఎంజాయ్ చేశారట. దాంతో విధి నిర్వహణలో అలక్ష్యం వహించారంటూ ఉన్నతాధికారులు తలంటారట. డీటీసీ ప్రతిష్టను దెబ్బతీశారనే కారణంగా ఆ ముగ్గురిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

Delhi transport staff dancing with girl in bus face action
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+