ఢిల్లీః ఆభరణాలు ధరించి మరీ ట్రాన్స్‌జెండర్ నామినేషన్.. వారికోసమేనట!
సమాజంలో ట్రాన్స్‌జెండర్ల హక్కులతోపాటు వారు ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు ఓ ట్రాన్స్‌జెండర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థిగా, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆకర్షణీయమైన వస్త్రధారణలో ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని, తన నామినేషన్ పత్రాలను అందించారు. ఈ ఒక్క నామినేషన్ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ట్రన్స్‌జెండర్ సమస్యలపై చర్చ మొదలైందనే చెప్పాలి.
వారికి సాయమందించేందుకు కృషి..
బిహార్‌కు చెందిన 26 ఏళ్ల రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్‌ల హక్కులతో పాటు సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలు చర్చించుకునేందుకు తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, మన దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయని, కానీ థర్డ్ జెండర్‌ల గురించి పట్టించుకున్న ధాఖలాలు లేవలని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో వివక్షకు గురవుతోన్న థర్డ్ జెండర్‌లకు సాయమందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు.

రూ. లక్ష నగదు, 200 గ్రాముల బంగారం, రూ.15.10 లక్షల విలువైన ఆస్తులను బ్యాంక్ ఖాతాలో ఉన్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగియగా, మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది. తర్వాత మే 13, 20, 25, జూన్ 1తో పోలింగ్ ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications