పెళ్లికి నిరాకరించిందని.. యువతిని ఆమె కుటుంబ సభ్యుల ఎదుటే..

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువతి(24)పై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఆ యువతిని దారుణంగా కాల్చి చంపాడు.

దక్షిణ ఢిల్లీలోని ఖిర్కి ఎక్స్ టెన్షన్ లో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనోజ్ అనే యువకుడు కాల్పులు జరిపిన సమయంలో ఘటనా స్థలంలో ఆమె సోదరుడు కూడా ఉన్నాడు.

Delhi Woman Killed By Alleged Stalker In Front Of Brother, Caught On Video

కాల్పులు జరిపిన అనంతరం మనోజ్ అక్కడ్నించి పరారయ్యాడు. ఈ సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.

మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మనోజ్ ఆ యువతికి స్నేహితుడు. కొన్ని నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా అతడు కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనోజ్ ఆమెపై కోపం పెంచుకుని బెదిరింపులకు దిగాడు.

ఆ యువతిని, ఆమె తమ్ముడిని చంపుతానంటూ బెదిరించగా.. ఆమె విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ గతంలో మనోజ్ ను హెచ్చరించింది. అయినప్పటికీ మనోజ్ తన బుద్ధి మార్చుకోకుండా శుక్రవారం ఈ దారుణానికి పాల్పడ్డాడు.

పోలీసులు ఆ యువతి మొబైల్ ఫోన్ లో మనోజ్ ఫోన్ నంబర్ ఆధారంగా అతడు నెబ్ సరాయి సమీపంలోని టిగ్రీ వద్ద ఉన్నట్లు కనిపెట్టి అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వెళ్లిన సమయంలో మనోజ్ తన స్నేహితుడు అఫ్రోజ్ తో కలిసి ఉన్నాడు. దీంతో పోలీసులు అతడిని కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ మైనర్లు కావడంతో
వారిని బాల నేరస్థుల గృహానికి తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 24-year-old woman in the national capital was allegedly shot dead by a man On Friday after she turned down his marriage proposal. The incident happened in south Delhi's Khirki Extension. The CCTV footage revealed three others accompanied the accused who fired at the woman. Two men have been arrested and an FIR for attempted murder has been registered. According to police, the accused, Manoj, and his friends went to the woman's house. When she came out, he shot her in the chest. Her brother is an eyewitness. She was rushed to a hospital but couldn't be saved, police said.
Please Wait while comments are loading...