దారుణం: ఆ విషయంలో గొడవ, యజమానిని రేప్ చేసి మర్డర్.. రాజధానిలో కీచకుడు

దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. అయితే ఆమెను హతమార్చే ముందు లైంగికదాడికి గురైనట్టు తెలుస్తోంది. గులాబీ బాగ్‌లో జరిగిన ఘటనతో రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతను ఇదివరకు మహిళ వద్ద పనిచేశాడని పోలీసులు వెల్లడించారు.

టీ కొట్టు మహిళపై

టీ కొట్టు మహిళపై

గులాబీబాగ్ వద్ద ఓ మహిళ టీ కొట్టు పెట్టుకుని నడిపిస్తోంది. తన వద్ద ఓ 24 ఏళ్ల ధరమ్ సింగ్ అనే యువకుడు పనిచేసేవాడు. ఇటీవల మానేసి.. వేరే చోట పని చేస్తున్నాడు. అయితే మహిళకు యువకుడికి మధ్య గతంలో పనికి సంబంధించిన నగదుపై శక్రవారం రాత్రి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

తోసి, లైంగికదాడి

తోసి, లైంగికదాడి

కోపోద్రిక్తుడైన యువకుడు మహిళను తోసేశాడు. అంతటితో ఆగకుండా లైంగికదాడి చేశాడు. తర్వాత ఆమె చనిపోయింది. అయితే శనివారం టీ కొట్టు తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని ఆరాతీశారు. ఇంటికెళ్లి చూడగా.. మహిళ అపస్మారకస్థితిలో కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు.

ఇలా వెలుగులోకి

ఇలా వెలుగులోకి

సీసీటీవీ ఫుటేజీ ద్వారా యువకుడిని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తే నేరాన్ని అంగీకరించాడు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె అప్పటికే చనిపోయినట్టు వారు పేర్కొన్నారు. తర్వాత హత్యకు గల కారణాలను పోలీసులు మీడియాకు వివరించారు.

పనిచేసేవాడు..

పనిచేసేవాడు..

మహిళ వద్ద గతంలో యువకుడు పనిచేసేవాడని తెలిపారు. అయితే అతనికి ఇవ్వాల్సిన నగదు ఇవ్వలేదని.. దానిపై శుక్రవారం గొడవ జరిగిందన్నారు. మాట మాట పెరిగిందన్నారు. మహిళ అతని మొహంపై ఉమ్మిందని తెలిపారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు.. తోసేశాడని పేర్కొన్నారు. తర్వాత లైంగికదాడి చేశారని తెలిపారు. ఆ వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+