దుర్మార్గుడు: పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని ఏం చేశాడో తెలుసా..?

తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదన్న కోపంతో 30 ఏళ్ల యువకుడు 24 ఏళ్ల మహిళను గన్‌తో కాల్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న మహిళను హరీష్ శర్మ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదని తుపాకీతో కాల్చాడు. తీవ్ర గాయాలపాలైన మహిళను ఆమె బంధువులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

శనివారం రోజు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అమ్మాయి తన అమ్మమ్మ ఇంట్లో ఉండగా హరీష్ వచ్చి తుపాకీతో కాల్చినట్లు చెప్పారు. కేవలం ఆ అమ్మాయిని చంపేందుకే హరీష్ ఉత్తర్ ప్రదేశ్ మురద్‌నగర్ నుంచి రూ.45వేల పెట్టి నాటు తుపాకిని కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు హరీష్‌ను అదుపులోకి తీసుకుని అతని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Delhi woman shot by jilted lover for rejecting marriage proposal

బాధితురాలు శనివారం రోజున తన అమ్మమ్మ ఇంట్లో ఉండగా రాత్రి సమయంలో కాలింగ్ బెల్ కొట్టారు. బాధితురాలు తలుపు తీయగా అక్కడే హరీష్ నిలబడి ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు వివరించింది. శర్మ మహిళతో మాట్లాడేందుకు అక్కడికి వచ్చాడని అయితే బాధితురాలు శర్మను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాల్సిందిగా మందలించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన శర్మ తనతో తెచ్చుకున్న తుపాకీ బయటకు తీసి ఆమెపై కాల్పులు జరిపాడని... ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. బుల్లెట్ బాధితురాలి ఛాతిలోకి దూసుకెళ్లిందని పోలీసులు వివరించారు. పేలుడు శబ్దం వినపడటంతో అక్కడే ఉన్న బాధితురాలి బంధువులు ఘటనాస్థలానికి పరుగులు తీసి ఆమెను హాస్పిటల్‌కు తరలించారని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే హరీష్ శర్మ ప్రతిరోజు తనను ఆఫీస్‌కు వెళ్లే సమయంలో ఫాలో అయ్యేవాడని, తనకు నరకం చూపించేవాడని బాధితురాలు పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇదే విషయమై తన ఆఫీస్ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. బాధితురాలికి ఐదు నెలల క్రితమే మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయ్యిందని.. అది ఓర్వలేకే హరీష్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా హరీష్ శర్మ ఇంటికి బయట మాటు వేసి ఆదివారం తెల్లవారు జామున తన ఇంటికి వస్తున్న సమయంలో హరీష్‌ను పట్టుకున్నట్లు డీసీపీ ఖాన్ చెప్పారు.

ఇదిలా ఉంటే బాధితురాలు తను ఇద్దరం ప్రేమించుకున్నట్లు చెప్పాడు హరీష్. తనను మోసం చేసి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆరోపించాడు. అయితే వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాడు హరీష్.అంతేకాదు బాధితురాలిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా హరీష్‌ను పలుమార్లు హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+