దేశంలో 80 శాతం కొత్త కరోనా కేసులకు మూలం డెల్టా వేరియంటే: వేగం, తీవ్రత ఎక్కువే

న్యూఢిల్లీ: భారత్ తోపాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనావైరస్ డెల్టా వేరియంట్.. అన్ని వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరమైనదని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అల్ఫా వేరియంట్ కంటే డెల్టా వేరియంట్ 40 శాతం నుంచి 60 శాతం వేగంగా వ్యాపించగలదని జాతీయ నిపుణుల కమిటీ వెల్లడించింది.

Recommended Video

    COVID Third Wave : వేగంగా వ్యాప్తి, కొత్త డెల్టా-ప్లస్ వేరియంట్.. 6 To 8 Weeks : AIIMS Chief

    B.1.617.2 లేదా డెల్టా వేరియంట్ మొదటిసారి అక్టోబర్ 2020లో భారత్‌లో గుర్తించారు. సెకండ్ వేవ్ వ్యాప్తిలో 80 శాతం కొత్త కరోనా కేసులు డెల్టా వేరియంట్ కారణంగానే నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కన్సోర్టమ్ కో చైర్ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. ఆల్ఫా వేరియంట్.. యూకే, యూఎస్ఏ, సింగపూర్ సహా 80 దేశాల్లో ఇప్పటికే వ్యాపించింది.

    Delta variant accounts for 80% of new coronavirus cases: Govt.

    అయితే, ఈ అల్ఫా కంటే డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల కమిటీ అంచనా వేసింది. ఈ డెల్టా వేరియంట్ మ్యూటేషన్.. తన స్పైక్ ప్రోటీన్‌ను ఏసీఈ2 రిస్పెటర్ సాయంతో మరింత వేగంగా వ్యాపించగలదని తాజా అధ్యయనాలు తేల్చాయి. అంతేగాక, శరీరంలోకి ప్రవేశించాక రోగ నిరోధక వ్యవస్థపై వేగంగా దాడి చేస్తుందని గుర్తించారు.

    శరీరంలోని ఊపిరితిత్తులు సహా పలు అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తేల్చారు. డెల్టా పస్ల్ వేరియంట్‌ కారణయ్యే ఏవై.1, ఏవై.2 వాటితో దేశ వ్యాప్తంగా మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లో 55 నుంచి 60 కేసులు నమోదయ్యాయి.

    ఏవై.1 వేరియంట్.. నేపాల్, పోర్చగల్, స్విట్జర్లాండ్, పోలాడ్, జపాన్ దేశాల్లో ఎక్కువగా వ్యాపించింది. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు ఈ డేల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్ కంటే డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి వేగం అంతగా ఉండదని అంచనా వేస్తున్నారు.

    డెల్టా వేరియంట్ కారణంగానే ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా నమోదైందని తెలిపారు. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పస్టం చేశారు. కరోనా ఆంక్షలను ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు ఎత్తివేయడంతో మళ్లీ జనసంచారం పెరిగిందని, దీంతో కరోనా వ్యాప్తి కూడా పెరిగే అవకాశం లేకపోలేదని తెలిపారు. అందుకే ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ.. కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ అరోరా స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+