వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండేళ్లలో డబుల్: తమిళనాడులో పెరిగిన 'సెక్స్ టాయ్స్' ఆర్డర్స్!..

చాలావరకు మధ్యవయస్కులైన మహిళలు, పురుషులే ఈ సెక్స్ టాయ్స్ ఆర్డర్ చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో ప్రతీ ఏటా సెక్స్ టాయ్స్ వాడకం పెరిగిపోతోంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న సెక్స్ టాయ్స్ ను చూసి అధికారులే బిత్తరపోతున్నారు. సెక్స్ టాయ్స్ దిగుమతుల పట్ల నిషేధం ఉన్నప్పటికీ.. చాలామంది వాటిని దిగుమతి చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.

<strong>సలాం అశ్విని: సెక్స్ వర్కర్ కడుపున పుట్టి.. న్యూయార్క్ వర్సిటీలో సీటు సంపాదించి!</strong>సలాం అశ్విని: సెక్స్ వర్కర్ కడుపున పుట్టి.. న్యూయార్క్ వర్సిటీలో సీటు సంపాదించి!

2015-16మధ్య కాలంలో చెన్నై పోర్టుకు విదేశాల నుంచి 238 సెక్స్ టాయ్స్ పార్సిల్స్ రాగా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 342 సెక్స్ టాయ్స్ పార్సిల్స్ వచ్చాయి. కాగా, ఇదే సంఖ్య 2014-15మధ్య కాలంలో కేవలం 169గా ఉంది. అంటే, రెండేళ్ల కాలంలో సెక్స్ టాయ్స్ వాడకం రెట్టింపు అయిందనేది దీన్నిబట్టి స్పష్టమవుతోంది.

ఈ నగరాల నుంచే దిగుమతి:

ఈ నగరాల నుంచే దిగుమతి:

చాలావరకు సెక్స్ టాయ్స్ పార్సిల్స్ లండన్,హాంగ్ కాంగ్,సింగపూర్, చైనాల నుంచే వస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఎక్కువ పార్సిల్స్ ఆన్ లైన్ లేదా పోస్టల్ సర్వీస్ ద్వారా అందుతున్నట్లు చెబుతున్నారు. చెన్నై పోర్టుకు అలాంటి పార్సిల్స్ రాగానే.. అధికారులు ఆ ఆర్డర్ ఇచ్చినవారిని పిలుపిస్తున్నారు.

సెక్స్ టాయ్స్ ఆర్డర్ చేస్తే.. జరిమానా

సెక్స్ టాయ్స్ ఆర్డర్ చేస్తే.. జరిమానా

సెక్స్ టాయ్స్ ఆర్డర్ చేస్తున్న వారిని అధికారులు గట్టిగా మందలించి రూ.5వేల వరకు జరిమానా విధిస్తున్నారు. సెక్స్ టాయ్స్ దిగుమతి అక్రమమని, దేశంలో దాని పట్ల నిషేధం ఉందని గుర్తుచేస్తున్నారు. జనవరి18,1964న జారీ అయిన కస్టమ్స్ యాక్ట్, సెక్షన్11(2)(b)కింద ఇలాంటి వస్తువులను దిగుమతి చేసుకోవడంపై నిషేధం ఉందంటున్నారు.

మధ్య వయస్కులే:

మధ్య వయస్కులే:

చాలావరకు మధ్యవయస్కులైన మహిళలు, పురుషులే ఈ సెక్స్ టాయ్స్ ఆర్డర్ చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. వీళ్లంతా తమ డ్రైవర్ లేదా పని మనుషుల ఇళ్ల అడ్రసులిచ్చి ఈ సెక్స్ టాయ్స్ తెప్పించుకుంటున్నారని అధికారులు చెప్పారు.

సాఫ్ట్ రబ్బర్‌తో సెక్స్ టాయ్స్:

సాఫ్ట్ రబ్బర్‌తో సెక్స్ టాయ్స్:

చెన్నై పోర్టుకు వస్తున్న సెక్స్ టాయ్స్ లో చాలావరకు సాఫ్ట్ రబ్బర్ తో చేసినవేనని తెలుస్తోంది. ఒక్కో దాని రేటు రూ.300 నుంచి రూ.15000వరకు ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో కొన్ని బ్యాటరీతో పనిచేసేవి ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఇలాంటి వస్తువులను ఉపయోగించడం ద్వారా శారీరకంగా, మానసికంగా కొన్ని సమస్యలు ఏర్పడుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

English summary
Demand for adult sex toys may be going up every year in Tamil Nadu with at least one parcel containing such items reaching the Chennai airport from abroad daily, but the customs department is saying a strong ‘no’ to such foreign pleasure objects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X