Chinmayi: వైరముత్తుపై చర్యలు తీసుకోండి.. సీఎం స్టాలిన్‍ను డిమాండ్ చేసిన సింగర్ చిన్మయ్..
తమిళ గాయని చిన్మయి శ్రీపాద గీత రచయిత వైరముత్తుపై చర్య తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్‌కు ట్వీట్ చేశారు. తమిళనాడులోని పని ప్రదేశాలన్నీ మహిళలకు సురక్షితంగా ఉండేలా చూడాలని ఆమె తమిళనాడు సీఎంను అభ్యర్థించారు. డీఎంకే పార్టీ సభ్యులు, స్టాలిన్‌తో సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఈ అంశంపై మాట్లాడరని చిన్మయి అన్నారు. బ్రిజ్ భూషణ్‌కైనా, వైరముత్తుకైనా రూల్స్ ఒకేలా ఉండాలి. ఒకరికి ఒక రకంగా, మరొకరికి మరోలా ఉండకూడదని చెప్పారు.
"గౌరవనీయులైన ముఖ్యమంత్రి, సార్, భారతదేశం అంతటా లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారికి న్యాయం జరిగేందుకు మీరు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. రాజకీయ నేతలు మాట్లాడితే మార్పు వస్తుందనే ఆశ కలుగుతుంది. అనేక పరిశ్రమలలో ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమలో POCSO లేదు. 17 మంది మహిళలు మీ స్నేహితుడు/సపోర్టర్‌కి మిస్టర్ వైరముత్తు వేధించాడు. అతను మీకు దగ్గరగా ఉండి మహిళలను వేధిస్తున్నాడు. తమిళనాడులోని ఇతర రాజకీయ నాయకుల మాదిరిగానే మీ పార్టీ కూడా ఆయనకు వేదికగా నిలుస్తోంది" అని ట్వీట్ చేశారు.

ప్రతిభావంతులైన, కలలు కనే మహిళల కెరీర్‌ను నాశనం చేయడానికి వైరముత్తు ఉన్నారని ఆరోపించారు. వైరముత్తుకు ఉన్న రాజకీయ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు వ్యతిరేకంగా నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. "తమిళ చలనచిత్ర పరిశ్రమలో దాదాపు 5 సంవత్సరాలుగా నిషేధం ఎదుర్కొంటున్నాను. కోర్టులో కేసు కూడా ఎదుర్కొంటున్నాను. ఈ దేశంలో మనకు కనెక్షన్లు లేదా పలుకుబడి లేనప్పుడు న్యాయం జరగడానికి మరో 20 ఏళ్లు పట్టవచ్చు" అని చిన్మయ్ అన్నారు.
తాను 2018-2019లో తిరిగి NCWకి ఫిర్యాదు చేశానని చెప్పారు. దర్యాప్తు చేయడానికి ఇంటికి వచ్చిన పోలీసు అధికారులకు చేతితో రాసిన ఫిర్యాదును అందజేసినట్లు చిన్మయ్ గుర్తు చేశారు. 'రాజీ'కి రావడానికి వైరముత్తు కాల్‌ను ఏర్పాటు చేసిన ఫోన్ కాల్ రికార్డులతో సహా తన వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. వైరముత్తు కుమారుడు మధన్ కార్కీకి కూడా తనకు ఫోన్ చేసినట్లు చిన్మయ్ తెలిపింది. తన తండ్రి ప్రవర్తన గురించి తనకు, తన కుటుంబానికి ముందే తెలుసునని మధన్ అంగీకరించాడని చెప్పారు.
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దుగా తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని చిన్మయ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
చిన్మయ్ ట్వీట్ కు పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. "మీరు కమల్ హాసన్ పై అలాంటి వాఖ్యలు చేసి ఉండకూడదు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీని చిన్మయ్ బదిలిస్తూ "హహహహా ఉంగా కమల్ సర్ ఉమ్ మేడాయి ఈతి అలంగారిచారు. స్టాలిన్ సర్ కమ్ కమల్ సర్ కుమ్ ఇంత విషయాల అంత తేడా ఉమ్ ఇల్లా (మీ కమల్ సర్ కూడా వైరముత్తుతో కలిసి వేదికపైకి వచ్చారు (ఒక కార్యక్రమంలో) కమల్ సర్, స్టాలిన్ సర్ మధ్య తేడా ఏమీ లేదు" అని అన్నారు.












Click it and Unblock the Notifications