'లగడపాటిది హత్యాయత్నమే': సీమాంధ్ర దేశం కావాలని

న్యూఢిల్లీ/హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వాడడాన్ని మంత్రి రాజీవ్ శుక్లా హత్యాయత్నంగా అభివర్ణించారు. అతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్ప్రే వినియోగం ఇతర సభ్యులను చంపడానికి ప్రయత్నించడమేనన్నారు. అతనిపై చర్యలు తీసుకోవడానికి సభ్యులతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు.

లగడపాటిపై నిప్పులు

సీమాంధ్ర ఎంపీలు వ్యవహరించిన తీరుపై అన్ని పార్టీల తెలంగాణ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. పార్లమెంట్‌ను అవమానపరిచిన ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో వారు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఎంపీలమని మరిచి పార్లమెంట్‌ను అవమానపరిచిన లగడపాటి, మోదుగులను శాశ్వత నిషేధం విధించాలని డికె అరుణ డిమాండ్ చేశారు.

Lagadapati Rajagopal

లగడపాటి, మోదుగుల సభ్యత్వాలను రద్దు చేయాలని ఈటెల రాజేందర్ అన్నారు. సీమాంధ్ర ఎంపిల చిల్లర వేశాలను చూసి దేశం తలదించుకుందని అన్నారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ తీవ్రవాదులను ఉరితీసినట్లుగానే, సభలోపల దాడికి పాల్పడిన సీమాంధ్ర ఎంపీలను ఉరి తీయాలని ఎర్రబెల్లి దయాకర రావు డిమాండ్ చేశారు. బాధ్యత గల ఎంపీలుగా ఉండి పార్లమెంట్‌లో దాడికి పాల్పడడం దేశ ద్రోహమే అవుతుందన్నారు. అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయడంతోపాటు భవిష్యత్‌లో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

సీమాంధ్రను ప్రత్యేక దేశం చేయాలి

పార్లమెంటులో ఉత్తరాధి ఆధిపత్యం కొనసాగుతోందని మాలమహానాడు ఆరోపించింది. సీమాంధ్రను ప్రత్యేక దేశంగా వేరుపర్చాలని డిమాండ్ చేశారు. ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలు స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన రోజే ఆయా ప్రాంతాలు, భాషల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+