సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు: నామాట తప్పయితే నన్ను ఉరితీయండి
Recommended Video

ఉన్నావ్ :వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందువరుసలో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి తన నోరుకు పనిచెప్పారు. ఈ సారి ఢిల్లీలోని జామామసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సాక్షి మహారాజ్. ఢిల్లీలోని జామా మసీదును కూలిస్తే ఆలయ అవశేషాలు బయటపడుతాయన్నారు. ఆలయ అవశేషాలపైనే మసీదు నిర్మాణం జరిగిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సాక్షి మహారాజ్.

ఉన్నావ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన సాక్షి మహారాజ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను చేసిన తొలి ప్రకటన గురించి చెప్పారు. అయోధ్య, మథురా, కాశీలను అలానే ఉంచి ఢిల్లీ జామా మసీదును కూల్చివేయాల్సిందిగా తాను చెప్పినట్లు వెల్లడించారు. జామా మసీదు కూల్చిన తర్వాత ఆలయానికి సంబంధించిన విగ్రహాలు కనిపించకపోతే తన పేరును మార్చుకుంటానని లేదంటే ప్రజలే తన పేరును మార్చాలంటూ సవాల్ విసిరారు. అంతేకాదు మథురాలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు సాక్షి మహారాజ్ చెప్పారు.
#WATCH: BJP MP Sakshi Maharaj says in Unnao "Rajneeti mein jab aaya to pehla mera statement tha Mathura mein, Ayodhya Mathura Kashi ko chhodo Dilli ki Jama Masjid todo, agar seedhion mein murtiyaan na nikle to mujhe faansi pe latka dena." (22.11.2018) pic.twitter.com/9pywDQ2flB
— ANI UP (@ANINewsUP) November 24, 2018
మొఘలుల కాలంలో పెద్ద సంఖ్యలో హిందువుల ఆలయాలు కూల్చివేయబడ్డాయని చెప్పిన సాక్షి మహారాజ్ వాటిపై మసీదులు కట్టారని వెల్లడించారు. వీటి కింద హిందూ దేవతలకు సంబంధించిన విగ్రహాలు కనిపిస్తాయని... ఒకవేళ కనిపించకుంటే తనను ఉరితీయాల్సిందిగా చెప్పారు. అయోధ్యలో ఓ ఆలయం ఉండేదని అమిత్ షా జైపూర్‌లో చెప్పారని గుర్తుచేసిన సాక్షి మహారాజ్...అది ఇప్పటికీ ఉన్నట్లు అమిత్ షా అన్నారని చెప్పారు. అక్కడే ఒక మహాద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తామని అమిత్ షా మాట ఇచ్చినట్లు చెప్పిన సాక్షి...ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడి ఉంటుందన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications