కష్టమైనా.. కఠిన నిర్ణయాలు తప్పవు: మోడీ భావోద్వేగం, ‘ఎన్ఎం’యాప్‌పై..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో నోట్ల మార్పిడి అంశంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని, అయితే దేశ ప్రయోజనాల దృష్టా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ఆయన ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. భవిష్యత్తులో దాని ప్రయోజనాలు పొందుతారని అన్నారు. నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.
ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుకు గల కారణాలను ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదే అని మోడీ అన్నారు.
నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజాన్ని ఎదుర్కోవాలన్నారు. నల్లధనంపై ప్రభుత్వ చర్యలను సభ్యులకు ప్రధాని మోడీ వివరించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరి అని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం ఇది మొదటి నిర్ణయమని, భవిష్యత్‌లో మరిన్ని కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు.

ఎన్ఎం యాప్‌లో చెప్పండి
I want your first-hand view on the decision taken regarding currency notes. Take part in the survey on the NM App. https://t.co/TYuxNNJfIf pic.twitter.com/mWv2frGn3R
— Narendra Modi (@narendramodi) 22 November 2016
పెద్ద నోట్ల రద్దు అంశంపై 'నరేంద్ర మోడీ' యాప్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలపాలని ప్రధాని మోడీ కోరారు. ఇబ్బందులు, ప్రయోజనాలు, ఎలాంటి విషయాలైన తెలపాలని చెప్పారు
ప్రజల సహకరిస్తున్నారు
పెద్దనోట్ల రద్దును దేశ ప్రజలందరూ స్వాగతించారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నోట్ల రద్దు ఆర్థికమంత్రి కూడా తెలియకుండా చేశారని విపక్షాలు అంటున్నాయని.. అలాంటప్పుడు పార్టీ నేతలకు ఎలా తెలుస్తుందని వారు అనుకుంటున్నారని ప్రశ్నించారు. నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నా ప్రతిపక్షాలు కావాలనే సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.
తాత్కాలిక ఇబ్బందులే
పెద్ద నోట్ల రద్దుతో తాత్కాలిక ఇబ్బందులు తప్పవని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మోడీ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరిస్తున్నారని చెప్పారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీకి పార్లమెంటరీ పార్టీ ఆయనకు అభినందనలు తెలిపిందని తెలిపారు.












Click it and Unblock the Notifications