నోట్ల రద్దు: రూ.500 నోట్లకు ఆఖరి అవకాశం! ఆ తర్వాత..
రూ.500 నోట్లు చెల్లుబాటు అయ్యే ప్రదేశాలు, గడువును కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే పాత రూ.1000 నోట్ల చెల్లుబాటు గడువు ముగిసిపోయింది. రూ.500 నోట్ల చెల్లుబాటు గడువు కూడా సమీపిస్తోంది.
న్యూఢిల్లీ: రూ.500 నోట్లు చెల్లుబాటు అయ్యే ప్రదేశాలు, గడువును కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే పాత రూ.1000 నోట్ల చెల్లుబాటు గడువు ముగిసిపోయింది. రూ.500 నోట్ల చెల్లుబాటు గడువు కూడా సమీపిస్తోంది.
ఈ నెల (డిసెంబర్) 15వ తేదీ తర్వాత మెడికల్ దుకాణం, ప్రభుత్వ సర్వీసుల చెల్లింపులో పాత రూ.500 నోట్లును తీసుకోరు. అలాగే, మొబైల్ రీచార్జ్‌కు కూడా రూ.500 నోటును తీసుకోరు.

అనంతరం ఈ నెల 31వ తేదీ వరకు బ్యాంకులలో డిపాజిట్ చేసేందుకు అనుమతిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి కేవలం రిజర్వ్ బ్యాంకు శాఖల్లో మాత్రమే పాత రూ.500 నోట్లను తీసుకుంటారు.
పాత రూ.500 నోట్లను డిసెంబర్ 15వ తేదీ తర్వాత తీసుకోరని, అయితే బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చునని ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ శశికాంత్ దాస్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications