వివాహేతర సంబంధం: క్రిస్మస్ వేడుకల్లో స్నేహితుడిని చంపేసిన దంతవైద్యుడు
చెన్నై: వివాహేతర సంబంధంతో మిత్రుడి ప్రాణాలను తీసింది. క్రిస్మస్ పార్టీలో ఇద్దరి మద్య వివాహేతర సంబంధం విషయమై గొడవ జరిగి కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో సంజీవ్‌రాజ్ అనే వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనకు కారణమైన దంత వైద్యుడు సెంథిల్‌రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో సోమవారం రాత్రి చోటు చేసుకొంది.
చెన్నైలోని గిండికి చెందిన సెంథిల్‌రాజ్ డెంటిస్ట్. అయితే ఆయన డెంటిస్ట్ వృత్తిని వదిలేసి ప్రైవేట్ కంపెనీలో చీఫ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అంతకుముందు ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో దంత వైద్యుడిగా పనిచేసేవాడు.
సెంథిల్ రాజ్ స్నేహితుడు సంజీవ్‌రాజ్. ఇతను కూడ గిండిలో నివసిస్తున్నాడు. ఉడుమలైపేటలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కూడ వివాహం చేసుకొన్నారు. కానీ, ఇద్దరూ కూడ తమ భార్యలకు విడాకులు ఇచ్చారు. ఇద్దరూ కూడ వేర్వేరుగా నివాసం ఉంటున్నారు.

సెంథిల్‌రాజ్ భార్యతో సంజీవ్‌రాజ్ భార్యతో వివాహేతర సంబంధం
సెంథిల్‌రాజ్ విడాకులిచ్చిన భార్యతో సంజీవ్‌రాజ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సెంథిల్‌రాజ్‌కు తెలిసింది. దీంతో సెంధిల్‌రాజ్ సంజీవ్‌రాజ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు పథకం పన్నాడని పోలీసులు చెబుతున్నారు. పార్టీ పేరుతో పిలిచి హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు.

క్రిస్మస్ పార్టీ
డిసెంబర్ 25వ, తేది రాత్రి మామల్లపురంలోని గెస్ట్‌హౌజ్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సెంథిల్ రాజ్ , ఆయన భార్య, సంజీవ్ రాజ్ కూడ ఉన్నారు. పార్టీ మద్యం తాగారు. ఈ సమయంలోనే సెంథిల్‌రాజ్ ఆగ్రహంతో సంజీవ్‌రాజ్‌ను వివాహతేర సంబంధంపై అడిగాడు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వావాదం చోటుచేసుకొంది. ఆగ్రహం పట్టలేక సెంథిల్ రాజ్ సంజీవ్‌రాజ్‌ను కత్తితో పొడిచారని పోలీసులు తెలిపారు.

ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణం
తీవ్రంగా గాయపడిన సంజీవ్‌రాజ్‌ను స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే సంజీవ్‌రాజ్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

సెంథిల్ రాజ్ అరెస్ట్
సెంథిల్ రాజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసు విషయమై దర్యాప్తు చేస్తున్నారు.సంజీవ్‌రాజ్ మృతదేహన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపారు.ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications