భార్య శృంగారానికి నిరాకరిస్తే విడాకులే..ఇక మీ ఇష్టం..!

Bombay High Court: భార్య తన భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలున్నాయని అనుమానించడం కూడా క్రూరత్వంతో సమానమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి చర్యల వల్ల భర్తకు మానసిక వేదన కలుగుతుందని పేర్కొంది. ఈ వివాహం తిరిగి కలిసే అవకాశం లేదని భావించిన న్యాయస్థానం.. భర్తకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. కుటుంబ న్యాయస్థానం మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.

భార్య పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం
విడాకుల కేసులో బాంబే హైకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. విడాకులకు అనుమతి ఇస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించి.. తనకు నెలకు రూ.లక్ష భరణం చెల్లించాలని కోరింది. ఈ పిటిషన్ ను జస్టిస్ రేవతి మోహితే డెరీ, జస్టిస్ నీలా గోఖలేల బెంచ్ విచారించింది. ఈ క్రమంలో భార్య తన భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించడం విడాకులకు ఒక కారణమని కోర్టు పేర్కొంది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Denying Intimacy Is Mental Cruelty Divorce Granted to Husband Bombay High Court Ruling

2013లో వివాహం.. 2014 నుండి విడిగా..
ఈ దంపతులకు 2013లో వివాహం జరిగింది. అయితే, డిసెంబర్ 2014 నుంచి వారు విడివిడిగా జీవించడం ప్రారంభించారు. 2015లో భర్త విడాకుల కోసం పుణెలోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. భార్య శృంగారానికి నిరాకరించడంతో పాటు వివాహేత సంబంధాలున్నాయని అనుమానిస్తూ వేధిస్తోందని.. రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ముందు ఇబ్బంది పెడుతూ వేదనకు గురిచేస్తోందని ఆరోపించాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిన నాటి నుంచి తనను పట్టించుకోవడం లేదని ఫ్యామిలీ కోర్టు ముందు వాపోయాడు. విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం విడాకులకు అనుమతించింది.

ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు అక్కడ చుక్కెదురైంది. మరోవైపు, మహిళ తన పిటిషన్‌లో తన అత్తమామలు మాత్రమే తనను వేధించారని... తాను ఇప్పటికీ తన భర్తను ప్రేమిస్తున్నానని, అందుకే పెళ్లిని రద్దు చేయదలుచుకోలేదని తెలిపింది.

అప్పీలుదారు మహిళ (భార్య) ప్రవర్తన భర్తకు ఖచ్చితంగా బాధను కలిగిస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. అదేవిధంగా, తన స్నేహితుల ముందు భర్తను అవమానించడం కూడా అతని పట్ల క్రూరత్వమే అవుతుందని కోర్టు తెలిపింది. భర్త దివ్యాంగ సోదరి పట్ల మహిళ ఉదాసీనంగా, కఠినంగా వ్యవహరించడం కూడా అతనికి, అతని కుటుంబ సభ్యులకు బాధను కలిగిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, దంపతుల మధ్య వివాహం ఎలాంటి మెరుగుదలకు అవకాశం లేదని పేర్కొంటూ కోర్టు మహిళ పిటిషన్‌ను కొట్టివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+