"భార్య సెక్స్‌ను నిరాకరించడం క్రూరత్వమే"
న్యూఢిల్లీ: కారణమేమీ లేకుండా భర్తను సుదీర్ఘకాలం పడక సుఖానికి దూరంగా ఉంచడం మానసికంగా చిత్రహింసలు పెట్టడం కిందకే వస్తుందిని, విడాకులు తీసుకోవడానికి ఇది కూడా సరైన కారణమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
తన భార్యకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేనప్పటికీ భౌతికంగా తనను నాలుగున్నర ఏళ్లుగా దూరం పెట్టిందని ఫిర్యాదు చేస్తూ ఓ భర్త దాఖలు చేసిన కేసులో హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. భర్త విజ్ఞాపన మేరకు విడాకులు మంజూరు చేసింది.

భర్త ఫిర్యాదుపై దిగువ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా భార్య అతడు చేసిన ఆరోపణలను స్పష్టంగా ఖండించలేకపోయిందని గుర్తు చేసింది. ఒకే ఇంటిలో ఉంటూ భర్తను సుదీర్ఘకాలం శారీరక సుఖానికి దూరంగా ఉంచినట్టు రుజువైందని కోర్టు నిర్ధారించింది.
అయితే, భర్త ఫిర్యాదును దిగువకోర్టు కొట్టివేసింది. అతడు చూపిన కారణాలేవీ హిందూ వివాహ చట్టంలోని క్రూరత్వ నిర్వచనానికి సరిపోవని అభిప్రాయపడింది. దీంతో భర్త హైకోర్టులో అపీల్ చేశారు. న్యాయమూర్తులు ప్రదీప్ నంద్రాజోగ్, ప్రతిభారాణితో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం భర్త వాదనతో ఏకీభవించింది.












Click it and Unblock the Notifications