కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డిప్యుటేషన్ భత్యం రెండింతలు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డిప్యుటేషన్ భత్యాన్ని రెండింతలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2 వేలుగా ఉన్న ఈ భత్యాన్ని గరిష్ఠంగా రూ. 4,500కు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డిప్యుటేషన్ భత్యాన్ని రెండింతలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2 వేలుగా ఉన్న ఈ భత్యాన్ని గరిష్ఠంగా రూ. 4,500కు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఏడో వేతన సంఘం సిఫారుసుల మేరకు కేంద్రం డిప్యుటేషన్ భత్యాన్ని పెంచింది. ఇకపై ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే మరోచోటుకి డిప్యుటేషన్‌పై వెళితే మూలవేతనంపై 5 శాతం లేదా గరిష్ఠంగా రూ.4,500 చెల్లిస్తారు.

వేరే ప్రాంతానికి డిప్యుటేషన్‌పై వెళ్తే మూలవేతనంపై 10 శాతం లేదా గరిష్ఠంగా రూ.9వేలు చెల్లిస్తారు. ప్రస్తుతం ఇవే శాతాలు చెల్లిస్తున్నప్పటికీ గరిష్ఠంగా చెల్లించే మొత్తాలు రూ.2 వేలు, రూ.4 వేలుగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications