పోలింగ్ వేళ తేల్చేసిన ఉదయ్ నిధి స్టాలిన్, విజయ్ 'లెక్క' క్లియర్..!!
తమిళనాడులో ఓటర్లు ఓటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లు ఉన్నాయి. సీఎం స్టాలిన్ తో సహా అన్ని పార్టీల ప్రముఖులు.. సీనీ స్టార్స్ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల కు తరలి వచ్చారు. తమిళనాడులో తాజా సమాచారం మేరకు 39.56 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఓటు వేసిన తరువాత డిప్యూటీ సీఎం ఉదయ్ నిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో.. ఇప్పుడు విజయ్ భవితవ్యం పై చర్చ మొదలైంది.
తమిళనాడు లో హోరా హోరీగా సాగిన ఎన్నికల సమరంలో ఓటర్లు తీర్పు మొదలైంది. ఒకే విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. విజయం పైన ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయం లోనే ముఖ్యమంత్రి స్టాలిన్.. డిప్యూటీ సీఎం ఉదయ్ నిధి స్టాలిన్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలోని జేబీఏఎస్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తమిళనాడు విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. తాను ఎలాగైతే ఓటు హక్కును వినియోగించుకున్నానో, అలానే ప్రతి పౌరుడు తమ ప్రజాస్వామ్య విధిని నిర్వర్తించాలని స్టాలిన్ పేర్కొన్నారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం ఉదయ్ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.

ఉదయ్ నిధి స్టాలిన్ ధీమా
పోలింగ్ జరుగుతున్న తీరు.. ఓటర్ల స్పందన పైన ఉదయ్ నిధి స్టాలిన్ సానుకూలంగా స్పందించారు. ఓటింగ్ సరళి స్పష్టంగా ఏం చెబుతుందో అర్దం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే కొత్త చరిత్ర లిఖించబోతోందని జోస్యం చెప్పారు. విభజన రాజకీయాలతో రాష్ట్రం లో ప్రవేశించాలని భావించే వారికి అవకాశం ఇవ్వమని వ్యాఖ్యానించారు. ఓటర్ల తమతోనే ఉన్నారు అనే విషయం మరోసారి స్పష్టం అయిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోనూ పోలింగ్ కు మంచి స్పందన కనిపిస్తోంది. యువత పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నారు. దీంతో.. విజయ్ ఆశలు పెరుగుతున్నాయి. కాగా.. ఎన్నికల నాలుగు రోజుల ముందు నుంచి సీన్ మారిపోయిందనే విశ్లేషణలు ఉన్నాయి. పోలింగ్ శాతం సాయంత్రానికి ఏ మేర నమోదు అవుతుందనే లెక్కలకు అనుగుణంగా ఫలితం పైన ఒక అంచనా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. పోలింగ్ సరళి గమనిస్తే మాత్రం ఓటర్ల తీరు ఏకపక్షంగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications