జర్నలిస్టు హత్య కేసులో దోషిగా తేలిన డేరాబాబా
కొన్ని నెలలుగా సైలెంట్‌గా సాగిన డేరాబాబా కేసు విచారణలో ముందడుగు పడింది. 2002లో ఓ జర్నలిస్టు హత్యకు సంబంధించినే కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు డేరాబాబాను దోషిగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురిని దోషులుగా ప్రకటించింది పంచకులా లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.ఇక డేరాబాబాకు ఎలాంటి శిక్ష విధించాలనేదానిపై జనవరి 17న వెల్లడించనుంది సీబీఐ కోర్టు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డేరాబాబాను సీబీఐ కోర్టు విచారణ చేసింది.
2002 అక్టోబర్ 24న ఛత్రపతి అనే జర్నలిస్టును అతని నివాసంలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. డేరాబాబా ఆశ్రమంలో అమ్మాయిలను ఎలా లోబర్చుకుని వారిని లైంగికంగా వేధించి ఆపై డేరాబాబా అత్యాచారం చేసేవాడో తన పూసగుచ్చినట్లు పత్రిక 'పూరా సచ్' ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు. దీంతో డేరా బాబా మనుషులు ఛత్రపతిని తన ఇంట్లో తుపాకీతో కాల్చారు. మూడువారాల పాటు చికిత్స పొందిన అనంతరం ఛత్రపతి మృతి చెందాడు.

సీబీఐ చార్జ్ షీటు ప్రకారం డేరా మేనేజర్ కృష్ణలాల్ డేరాబాబాకు చెందిన లైసెన్సు రివాల్వర్, వాకీటాకీలను ఇద్దరి షూటర్లకు ఇచ్చినట్లు ఉంది. కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్ అనే వ్యక్తులకు ఇచ్చి చత్రపతిని చంపాల్సిందిగా పురమాయించినట్లు సీబీఐ చార్జ్‌షీటులో పేర్కొంది. ప్రస్తుతం డేరా బాబా అంతకు ముందు కేసులో విధించిన 20 ఏళ్లు జైలు శిక్ష రోహతక్ లోని సునారియా జైలులో అనుభవిస్తున్నాడు. తీర్పు రావడంతో హర్యానాలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆగష్టు 2017లో డేరాబాబా నేరస్తుడని కోర్టు తీర్పు చెప్పడంతో పంజాబ్, హర్యానాలో పలుచోట్ల హింస చెలరేగింది. ఆ హింసలో దాదాపు 40 మంది చనిపోగా చాలా మంది గాయాలపాలయ్యారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications