కశ్మీర్‌లో ఐఈడీ కలకలం... భద్రతా దళాల అప్రమత్తతతో తప్పిన భారీ ముప్పు (వీడియో)
జమ్ము కశ్మీర్‌లోని రాజౌలి ప్రాంతంలో మరో ఐఈడీ బాంబు బయట పడింది.కశ్మీర్‌లోని కెల్లార్ చౌక్ ప్రాంతంలో ఉగ్రవాదులు పాతిపెట్టిన ఐఈడీ బాంబును పోలీసుల కూంబింగ్‌లో భాగంగా బయటపడింది. దీంతో భద్రతాల దళలు అక్కడకు చేరుకునే వరకు నేషనల్ హైవే పై సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్ రవాణాను నిలిపివేశారు.

అనంతరం బాంబ్ స్క్వాడ్ అక్కడకు హుటాహుటిన చేరుకుని బాంబును నిర్వీర్యం చేశారు. అనంతరం ట్రాఫిక్‌ను నియంత్రించారు. ముందుగా బాంబును కనుక్కోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగ గత వారమే కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఐఈడీ బాంబు పేలీ ఏడుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
#WATCH District Police Office Rajouri (J&K): Suspected IED material destroyed by bomb disposal squad at the Jammu-Poonch highway in Kallar today. pic.twitter.com/QJOYTgBQah
— ANI (@ANI) May 27, 2019












Click it and Unblock the Notifications