వామ్మో.. ల్యాపీకి బదులు సబ్బులు, అదీ తెలియకపోవడంతో..
పండగ సీజన్ వచ్చేసింది. ఈ కామర్స్ సైట్ ఆఫర్స్ పెడుతున్నాయి. బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అని జనాలను అట్రాక్ట్ చేస్తున్నాయి. తక్కువ ధరకు రావడంతో ఆ మేరకు సేల్స్ జరుగుతున్నాయి. అయితే షాపింగ్ ఓకే.. అన్నీ వస్తువులు ఉన్నాయో లేదో చూసి తీసుకోవాలి.. లేదంటే యశస్వి శర్మకు జరిగినట్టే మీకు జరిగే అవకాశం ఉంది.

ల్యాప్ టాప్ లేకపోగా..
ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇచ్చిన ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. ఓ రూల్ అతని తండ్రికి తెలియకపోవడంతో నష్టపోయారు. ల్యాప్‌టాప్‌కు బదులు డిటర్జెంట్ పౌడర్ పొట్లాలు చేతికొచ్చాయి.తన పరిస్థితిని వివరిస్తూ అతడు పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఐఐఎమ్ పట్టభద్రుడైన యశస్వీ శర్మ.. ఇటీవల బిగ్ బిలియన్ డేస్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.

పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయి..
తండ్రి కోసం ల్యాపీ తీసుకున్నాడు. నెక్ట్స్ డే ప్యాకెజీ ఇంటికి డెలివరీ అయ్యింది. డెలివరీ బాయ్ పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయాక దాన్ని తెరిచి చూస్తే ఘడీ డిటర్జెంట్ ప్యాకెట్లు కనిపించడంతో.. ఇంటిల్లపాదీ షాకయ్యారు. కస్టమర్‌కేర్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఫిర్యాదు చేయగా..పరిష్కారం చూపలేకపోయారు. డెలివరీ బాయ్ ఎదుటే పార్సిల్ తెరిచి లోపల ఏముందో చూసుకోకపోతే కస్టమర్‌దే పొరపాటని వారు చెప్పారని వివరించారు.

ఓపెన్ బాక్స్ డెలివరీ
తన తండ్రికి ఓపెన్ బాక్స్ డెలివరీ విధానం గురించి తెలియకే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపాడు. పార్సిల్ లోపల ల్యాప్‌టాప్ ఉంటుందనే భరోసాతో డెలివరీ బాయ్ సమక్షంలో దాన్ని తెరిచి చెక్ చేసుకోకుండా ఓటీపీని ఇచ్చారని వివరించాడు. డెలివరీ బాయ్ నుంచి పార్సిల్ డెలివరీ తీసుకుంటున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. విషయం చెప్పినా ఫ్లిప్‌కార్ట్ వినిపించుకోలేదని చెప్పాడు. సమస్య పరిష్కారం కాకుంటే వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తాననివి స్పష్టం చేశాడు.












Click it and Unblock the Notifications