Flash Floods: వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన ఇళ్లు, 60 మందికి పైగా గల్లంతు (వీడియో)
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో మేఘాల విస్ఫోటనం కారణంగా దరాలి గ్రామంలో భయంకరమైన ప్రకృతి విపత్తు సంభవించింది. ఖీర్ గంగా నది ఎగువ పరివాహక ప్రాంతంలో మేఘాలు విస్ఫోటనం చెందడంతో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల్లో ఇళ్లు, హోటళ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని స్థానికులు భయపడుతున్నారు. దాదాపు మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, 20 నుంచి 25 హోటళ్లు, ఇళ్లు కొట్టుకుపోయి ఉండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో కుంభవృష్టి కారణంగా ఈ వరదలు సంభవించాయి.
హర్సిల్ ప్రాంతంలోని ఖీర్ గంగా నదిలో నీటిమట్టం పెరగడంతో దరాలి గ్రామంలో భారీ నష్టం జరిగినట్లు జిల్లా పోలీసులు తెలిపారు.వరద ఉధృతికి దరాలి గ్రామంలోని ఇళ్లు, దుకాణాలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, కొన్ని హోటళ్లు, హోమ్‌స్టేలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బర్కోట్ తహసీల్‌లోని బనాలా పట్టి ప్రాంతంలో కుడ్ గఢేరా నది ఉప్పొంగడంతో సుమారు 18 మేకలు కొట్టుకుపోయాయి.

సహాయక చర్యలు, వాతావరణ హెచ్చరికలు
ఎస్‌డీఆర్‌ఎఫ్ (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం), ఆర్మీ, స్థానిక అధికారులు సంఘటనా స్థలంలో సహాయక, రెస్క్యూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. హర్సిల్, భత్వారీ నుంచి కూడా రెస్క్యూ బృందాలను పంపించారు. భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 10 వరకు, ముఖ్యంగా కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని, నదులకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనపై తన బాధను వ్యక్తం చేశారు. సహాయక పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, తాను నిరంతరం సీనియర్ అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని ఆయన తెలిపారు.ఈ ఘటనతో గంగోత్రి ధామ్, జిల్లా ప్రధాన కార్యాలయం మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు తరచుగా సంభవిస్తూ, ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి.
Cloudburst Tragedy in Dharali, Gangotri
— Kumaon Jagran (@KumaonJagran) August 5, 2025
Scary visuals are emerging from Dharali near Gangotri after a devastating cloudburst. Several people are feared missing, and reports of casualties have surfaced. A massive flash flood in Khir Gadh have caused significant damage in the… pic.twitter.com/UpAByEpwns
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications