ఆ విమానాల్లో ఇంధన స్విచ్ లను చెక్ చేయాలి.. డీజీసీఏ కీలక ఆదేశాలు
అన్ని ప్రయాణాల్లో విమాన ప్రయాణం సురక్షితం అనుకుంటారు చాలా మంది. కానీ ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. నిత్యం సాంకేతిక సమస్యలతో విమానాలు ఎక్కడపడితే అక్కడ ల్యాండింగ్ అవుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతిచెందారు. ఇటీవలి కాలంలో అనేక విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. అయితే ఈ విమాన ప్రమాదంపై జరిపిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానంలోని ఇంజిన్ లకు ఇంధన సప్లై నిలిచిపోవడం కారణంతోనే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి పోయినట్లు నిర్థారణ అయింది.
ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ B787 డ్రీమ్ లైనర్, B737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ సిస్టమ్స్ ను పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని సూచనలు చేసింది. ఈ విమానాలను ప్రస్తుతం ఎయిర్ ఇండియా గ్రూప్, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. జూన్ 12 న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మానంలోని ఇంజిన్ లకు ఇంధన సప్లై నిలిచిపోవడం కారణంతోనే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి పోయినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలోనే డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
Aviation regulator DGCA ordered airlines to inspect the lock on the fuel control switches on Boeing 787 and Boeing 737 planes by July 21, a move that comes days after the preliminary probe report into #AirIndia’s Boeing 787 crash found that the switches were cut off before the… pic.twitter.com/cAYmroXIZS
— The Hindu (@the_hindu) July 14, 2025
కొన్ని విదేశీ వైమానిక సంస్థలైన ఇతిహాద్ లాంటివి.. తమ డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే ఇలాంటి తనిఖీలు చేపట్టాయి. దీంతో అప్రమత్తమైన డీజీసీఏ సూచనలు చేసింది. అమెరికాకు చెందిన వైమానిక సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నివేదిక ప్రకారం.. ప్రస్తుతం చాలా ఇంటర్నేషనల్, నేషనల్ విమానయాన సంస్థలు వారి విమానాల్లోని ఇంజిన్ లకు ఇంధన సరఫరా తనిఖీలు ప్రారంభించినట్లు సమచారం. ఈ క్రమంలోనే.. బోయింగ్ B787 డ్రీమ్ లైనర్, B737 సిరీస్ విమాన ఆపరేటర్లు ఈ నెల 21 లోగా ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థల తనిఖీలు పూర్తి చేయాలి అని డీజీసీఏ సూచనలు చేసింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications