పన్నీర్ సెల్వం నిరాహార దీక్షలో దుమ్ములేపిన ధనుష్ పాట

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేపట్టిన ఒక్క రోజు ఉపవాస సత్యాగ్రహ దీక్షకు ఊహించని మద్దతు వచ్చింది.

చెన్నైలోని ఎగ్మూరులోని రాజరత్నం స్టేడియం దగ్గర పన్నీర్ సెల్వం చేపట్టిన దీక్షలో వేలాది మంది మహిళలు పాల్గోన్నారు. మహిళా దినోత్సవం రోజు అమ్మ జయలలిత మరణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అన్నాడీఎంకేలోని అమ్మ అభిమానులు, మహిళలు నినాదాలు చేశారు.

ఎగ్మూరులోని రాజరత్నం స్టేడియం దగ్గర పన్నీర్ సెల్వం దీక్ష చేస్తున్న వేదిక దగ్గర ధనుష్ హీరోగా నటించిన వీఐపీ సినిమాలోని అమ్మా అమ్మా పాటను పదేపదే వినిపించడంతో ఆ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి.

Dhanush movie song Amma Amma from the movie VIP was seen heard in Team OPS fast protest place

పన్నీర్ సెల్వం చేపట్టిన దీక్షకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉందని ముందుగానే ఇంటెలిజెన్స్ వర్గాలు తమిళనాడు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. కార్యకర్తలను తరలించకుండా అడ్డుకోవడానికి ప్రయివేట్ ట్రావెల్స్ ను కట్టడి చెయ్యడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నించింది.

అయితే కార్యకర్తలు స్వచ్చందంగా బస్సుల్లో దీక్ష జరుగుతున్న శిభిరాల దగ్గరకు చేరుకున్నారు పన్నీర్ సెల్వం చేపట్టిన ఉపవాస సత్యాగ్రహ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ అమ్మ అభిమాలు తరలిరావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

చెన్నై నగరంతో సహ సేలంలోని కలెక్టరేట్ వద్ద, కోయంబత్తూరులోని శివానంద కాలనీ, తిరుప్పూర్ లో కుమరన్ పాళయం, తిరునల్వేలిలో కొత్త బస్ స్టాండ్, తంజావూరులో హెడ్ పోస్టాఫీస్, తూత్తుకుడిలో ఎంజీఆర్ దిడల్, తిరుచ్చిలో ఉలవర సందై వేదికలుగా దీక్షలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+