ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా - ఫలించిన కాక్రోచ్ పార్టీ పోరాటం..!!
ఎట్టకేలకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. కొద్ది రోజులుగా నీట్ పరిణామాల నేపథ్యం లో కాక్రోచ్ పార్టీ- విద్యార్ధులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తింది. సీజేపీతో ప్రభుత్వం రెండో విడత చర్చల వేళ వారి ప్రధాన డిమాండ్ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు సమాచారం. కాసేపట్లో జరిగే చర్చల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఎట్టకేలకు అంగీకరించారు. దీంతో.. ఢిల్లీ వేదికగా సాగుతున్న నిరసనలకు ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది.
కేంద్రం విద్యార్ధులు.. కాక్రోచ్ పార్టీ నిరసనలకు దిగి వచ్చింది. వారి ఆందోళన విరమింప చేసేలా అనేక చర్యలు తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా కీలక నిర్ణయాలను వెల్లడించారు. అయితే, సీజేపీతో జరిగిన చర్చల మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ పైనే విద్యార్థి సంఘాల నేతలు పట్టుబట్టారు. దీంతో.. ఈ వ్యవహారానికి ముగింపు ఇచ్చేందుకు ప్రభుత్వం తప్పని స్థితిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలని నిర్ణయించింది.

నీట్ పరీక్ష పత్రాల లీక్.. తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఒక్క సారిగా కలకలం మొదలైంది. పది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వం నిరసనకారులతో చర్చలకు సిద్దమైంది. దేశ వ్యాప్తంగా విద్యార్ధులకు ఇదే డిమాండ్ పైన మద్దతు లభించింది. దీంతో.. ప్రభుత్వం ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాకుండా.. వారిని శాంతింపచేసేందు కు పలు చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో పూర్తి ప్రక్షాళన చేసింది. పరీక్ష పత్రాలు లీక్ అయితే అందుకు బాధ్యుల పైన కఠిన చర్యలకు వీలుగా కేబినెట్ కొత్త బిల్లుకు ఆమోదం తెలిపింది.
కాగా, కాక్రోచ్ పార్టీతో ప్రభుత్వం తొలి విడత చర్చల్లో కీలక అంశాల పైన ప్రస్తావన చేసారు. అందులో నీట్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులకు రూ కోటి చొప్పున పరిహారం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అదే విధంగా నిరసనల్లో భాగంగా విద్యార్ధుల పైన నమోదు చేసిన కేసుల ఉప సంహరణకు అంగీకారం తెలిపింది. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఆందోళన విరమిస్తామని నిర్వాహకులు తేల్చి చెప్పారు. దీంతో.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు పైనా ఆలోచన జరిగింది. అయితే.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మారినా.. ఆందోళన తప్పదని.. రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థి సంఘాల నేతలతో పాటుగా రాహుల్ గాంధీ డిమాండ్ చేసారు. ఫలితంగా తప్పని పరిస్థితుల్లో యువత ఆకాంక్షలను గౌరవిస్తూ తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications