ఒక చిన్న పిల్లను రేప్ చేసి కాల్చేసిన దుర్మార్గుడు, చివరికి తల్లిని కూడా ?

Recommended Video

    ఒక చిన్న పిల్లను రేప్ చేసి కాల్చేసిన దుర్మార్గుడు, చివరికి తల్లిని కూడా ?

    కొన్ని నెలల క్రితం ఫిబ్రవరి లో సంచలనం సృష్టించిన ఈ ఘటన తెలియని వాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. చెన్నయ్ లో 7 ఏళ్ళ పాప హాసిని ని అత్యంత దారుణంగా రేప్ చేసి, చంపేసి తరువాత కాల్చేసిన దుర్మార్గుడు ధస్వంత్ కొన్ని నెలల కిందట బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే పాము కోరల్లో ఎప్పుడూ విషం ఉంటుంది అన్నట్లుగా ఆ కిరాతకుడు ఇప్పుడు మళ్లి మరో దుర్మార్గానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామానికి కి చెందిన రాజేష్ దంపతులు చెన్నయ్ లో జీవనం సాగించేవారు. వారి 7 ఏళ్ళ పాప హాసిని. అయితే ఆ దంపతులు ఉంటున్న అపార్ట్మెంట్ లోనే ఉండే మెకానికల్ ఇంజినీర్ ధస్వంత్ అత్యంత దారుణానికి తెగబడ్డాడు. ఆ పాపకు బొమ్మలు, తిను బండారాలు అలవాటు చేసి ఒకరోజు అత్యాచారం చేసి, చంపేసి తరువాత కాల్చేసి పాశవికంగా ప్రవర్తించాడు. అయితే నిందితుడ్ని కనిపెట్టిన పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసారు. అయితే విచారణ జరుగుతుండగానే హైకోర్ట్ అతనిమీద గూండాస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలంచింది. ఇంతలో ధస్వంత్ తండ్రి బెయిల్ అప్లై చేసాడు. ఇంత కిరాతకం చేసినా అతనికి బెయిల్ లభించింది.

    దీనిమీద హాసిని తండ్రి అప్పట్లో తన ఆవేదనను వ్యక్తం చేసాడు. తనకు చాలామంది న్యాయం జరగదని ముందే చెప్పారని కానీ పోలీసులు న్యాయస్థానం మీద నమ్మకంతో తను ముందుకొచ్చానని చెప్పాడు. ధస్వంత్ మీద గూండాస్ యాక్ట్ బుక్ చేసామని అసలు సంవస్థరం లోపు అతను బెయిల్ మీద బయటికొచ్చే సమస్యే లేదని పోలీసులు చెప్పారని వాపోయాడు. కానీ ఫిబ్రవరి లో అరెస్ట్ అయిన ధస్వంత్ సెప్టెంబర్ లోనే బెయిల్ మీద బయటకు రావటం తనకు కష్టంగా ఉందని చెప్పాడు. నా కూతురు తిరిగి రాదు అని నాకు తెలుసు, కానీ నేను న్యాయం కోసం పోరాడుతూనే ఉంటా అని హాసిని తండ్రి తన ఆవేదన వ్యక్తం చేసాడు.

    అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే బెయిల్ మీద బయటకొచ్చిన దుర్మార్గుడు ధస్వంత్ ఈ నెల 2 న సొంత తల్లిన్నే హతమార్చాడు. ఇనుప రాడ్ తో తల పగలకొట్టి మరి చంపాడు. అయితే తండ్రిని కూడా చంపడానికి ప్లాన్ చేసానని కానీ కుదరలేదని పోలిసులతోనే చెప్పడం గమనార్హం. ఇంట్లో డబ్బుదొరకకపోవడంతో విలాసాలకు ఇబ్బంది కలగడంతో తన తల్లిదండ్రుల మీద కోపం పెంచుకునట్టు ధస్వంత్ చెప్పాడు. తల్లిని చంపి ఇంట్లో కాజేసిన డబ్బుతో చెన్నయ్ నుండి ముంబై వెళ్ళి అక్కడ గుర్రం రేసుల్లో డబ్బులు పెడుతూ ఎంజాయ్ చేస్తున్న ధస్వంత్ ని చెన్నయ్ పోలీసులు పట్టుకుని ముంబై నుండి తీసుకొచ్చారు. తరువాత విచారించగా డబ్బు కోసమే తల్లిని చంపినట్టు చెప్పాడు. కాగా ధస్వంత్ కేసులో రేపు విచారణ జరగనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+