టెక్ బిలియనీర్ ప్రసన్న శంకర్- దివ్య విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్
చెన్నైకు చెందిన టెక్ బిలియనీర్ ప్రసన్న శంకర్ గురించి తెలియని వ్యాపారవేత్తలు ఉండరు. HR టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సింగపూర్‌కు చెందిన క్రిప్టో సోషల్ నెట్‌వర్క్ 0xPPL.com వ్యవస్థాపకుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన భార్యతో విడాకుల వివాదం దేశవ్యాప్తంగా సంచలంగా మారింది. ప్రసన్న శంకర్ విడాకులకు దారి తీసిన వివాదాన్ని ఇటీవల ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని, దీనికి సంబంధించి సాక్ష్యాలు, వాట్సప్ చాటింగ్ లు కూడా ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారింది.

అయితే తాజాగా ఓ పబ్లికేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసన్న శంకర్ సతీమణి దివ్య శశిథర్ సంచలన విషయాలు వెల్లడించారు. "శంకర్ తో పెళ్లి నా జీవితంలోనే మరచిపోలేని పీడ కల. మాకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పన్నుల నుంచి తప్పించుకునేందుకు శంకర్.. నన్నూ బాబును పలు దేశాలు తిప్పేవాడు. బాబు పుట్టిన కొన్నిరోజుల నుంచే తనతో శృంగారం చేయమని వేధించేవాడు. శృంగారం అనేది మగవాడి ప్రాథమిక అవసరం అని చెప్పేవాడు. నువు పడుకోపోతే.. వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి శృంగారం చేస్తానని బెదిరించేవాడు. ఆఖరికి తన ఫ్రెండ్స్ తోనూ పడుకోమని ఇబ్బంది పెట్టేవాడు" అని దివ్య శశిథర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారం అమెరికా కాలిఫోర్నియాలోని కోర్టులో విచారణలో ఉంది. కోర్టు విచారణలో భాగంగా అక్కడ కూడా దివ్య శశిథర్ పలు అంశాలను కోర్టు ముందు ఉంచారు. తన భర్త ప్రసన్న శంకర్.. తనను ఉద్యోగం మానేసి మరీ తనతో శృంగారం చేయాలని వేధించేవాడని పేర్కొన్నారు. అంతేకాక తన స్నేహితులతోనూ పడుకోవాలని ప్రెషర్ పెట్టేవాడని కోర్టుకు తెలిపారు.
ప్రసన్న శంకర్, దివ్య భార్యాభర్తలు. దివ్య గతంలో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేశారు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్య, కుమారుడు అమెరికా పౌరులుగా ఉన్నారు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య కొన్నాళ్లుగా గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉంది. అయితే భరణం కింద నెలకు 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని భార్య దివ్య డిమాండ్ చేసింది. ఈ క్రమంలో.. దీనిపై చర్చలు నడుస్తున్నాయి.
అయితే.. ప్రసన్న శంకర్ లక్షల కోట్ల విలువైన కంపెనీలకు సహ వ్యవస్థాపకుడు కావడంతో వీరి విడాకుల వివాదం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గొడవలో భర్త చెబుతున్నది నిజమా.. భార్య చెబుతున్నది నిజమా అనేది అర్థం కాకుండా ఉంది.












Click it and Unblock the Notifications