12 ఏళ్ళకే సన్యాసం: సూరత్‌లో వజ్రాల వ్యాపారి కొడుకు భవ్యషా నిర్ణయం

సూరత్: కోట్లాది రూపాయాల వ్యాపారానికి వారసుడైన 12 ఏళ్ళ భవ్య షా జైన సన్యాసిగా మారాలని నిర్ణయం తీసుకొన్నాడు ఈ నిర్ణయంపై కుటుంబసభ్యులు కూడ సంతృప్తిని వ్యక్తం చేశారు. భగవంతుడు చూపిన సత్యమార్గంలోనే పయనించాలని తాను ఈ నిర్ణయం తీసుకొన్నానని ఆయన చెప్పారు.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దీపేష్‌షా కొడుకు భవ్య షాకు 12 ఏళ్ళు వజ్రాల వ్యాపారిగా ఆ కుటుంబానికి ఎలాంటి కష్టాలు కూడ లేవు. అయితే ఈ తరుణంలో భవ్యషా జైన సన్యాసిగా మారాలని తన అభిప్రాయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు.

Diamond merchants 12-year-old son gives up worldly pleasures to become a Jain monk, family elated

ఈ నిర్ణయంపై వారు పెద్దగా ఆశ్చర్యపోలేదు. కొడుకు తీసుకొన్న నిర్ణయంపై తండ్రి దీపేష్‌ షా హర్షం వ్యక్తం చేశారు.తాను తల్లిదండ్రులను విడిచి వెళ్తున్నాననే బాధ కొంత ఉందన్నారు. అయితే భవిష్యత్తులో వారు కూడ తన బాటలనే పయనిస్తారని భవ్యషా చెప్పారు.

దీపేష్‌షా కూతురు కూడ 12 ఏళ్ళ వయస్సులోనే జైన సన్యాసిగా మారింది. తన కొడుకు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల దీపేష్ షా సంతోషాన్ని ప్రకటించారు. కోరికలకు మూలమైన కర్మలను కూడ జైన సన్యాసులు వదిలేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+