మహిళ పట్ల హోంమంత్రి నీచ ప్రవర్తన(వీడియో)
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సీనియర్ నేత, హోంమంత్రి బాబూలాల్ గౌర్ ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. భోపాల్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ఓ బస్సులో పలువురు ఎక్కుతున్న సమయంలో ఒక మహిళను ఉద్దేశ పూర్వకంగా చేతులతో తాకారు.

చుట్టూ కార్యకర్తలు ఉండటంతో ఎవరికీ కనిపించబోదనే ఉద్దేశంతో ఓ మహిళ బస్సు ఎక్కుతుండగా ఆమెను టచ్ చేశారు. అయితే, అక్కడ ఏర్పాటు చేసిన ఓ కెమెరాలో సదరు మంత్రిగారి ఈ నీచ ప్రవర్తన రికార్డయింది.
ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ మారింది. దీంతో సదరు మంత్రిపై విమర్శలు వర్షం కురుస్తోంది. బాబూలాల్ వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని పలువురు మండిపడుతున్నారు. సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
WATCH: Madhya Pradesh Home Minister Babulal Gaur touches a woman inappropriately during an event in Bhopalhttps://t.co/kOLz9TU2lQ
— ANI (@ANI_news) April 21, 2016












Click it and Unblock the Notifications