నిలదీసిన వలస కూలీ.. ఎమ్మెల్యే ఎంత మాటన్నాడు.. దుమారం రేపుతున్న కామెంట్స్..
బీహార్‌లోని షేక్‌పురాకు చెందిన జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోని ఓ వలస కూలీ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 22న షేక్‌పురా జిల్లాలోని చాంది గ్రామంలో ఉన్న ఓ క్వారెంటైన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్వారెంటైన్‌లో ఉన్న వలస కూలీలతో ఆయన మాట్లాడగా.. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీస్తూ వారు ఎమ్మెల్యేని పలు ప్రశ్నలు అడిగారు.
అందులో ఓ వ్యక్తి... బీహార్ ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ఎందుకు విఫలమయ్యాయి అని ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ ఎమ్మెల్యే.. 'నిన్ను కన్న నీ తండ్రి నీకేదైనా జాబ్ ఇచ్చాడా..?' అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. చాలామంది నెటిజెన్స్ ఎమ్మెల్యే రణధీర్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రజా ప్రతినిధిగా బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఇంత నిర్లక్ష్యపూరిత సమాధానమా అని ప్రశ్నిస్తున్నారు. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి ప్రతాప్ సైతం రణధీర్ కుమార్‌పై మండిపడ్డారు. ఆయన స్టేట్‌మెంట్ అసంబద్దంగా ఉందన్నారు. మరోవైపు రణధీర్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను వలస కూలీలను ఉద్దేశించి ఆ కామెంట్ చేయలేదని.. ఆ వ్యక్తి తనకు చాలా రోజులుగా పరిచయం ఉన్నవాడేనని అన్నారు. దీనిపై అవనసర రాద్దాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Recommended Video
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications