నేతలను బంధించి బిల్లు పాస్ చేయించుకుంటారా ..? మోడీ సర్కార్‌పై దీదీ గుస్సా
న్యూఢిల్లీ : కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేసి ముందుజాగ్రత్త చర్యగా నేతల అరెస్ట్ చేయడాన్ని విపక్షాలు ఖండించాయి. ఇదీ సరికాదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేతలను అరెస్ట్ చేసి జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుపై సభలో చర్చ జరుపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
రాజ్యసభలో కశ్మీర్ విభజన బిల్లుకు ఆమోదం పొందిన క్షణాల్లోనే జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబ ముఫ్తీని అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .. కేంద్ర పెద్దల ఆదేశాలతో ఆమెను హరి నివాస్ గెస్ట్ హౌస్‌కు తరలించారు. మరోవైపు మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయమే గృహ నిర్బందం చేయగా .. రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్ట్‌ను విపక్షాలు తప్పుపట్టాయి. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదని సూచించారు. నేతలను అరెస్ట్ చేసి బిల్లును పాస్ చేయించుకుంటారా అని దుమ్మెత్తిపోశారు. వీరితోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను కూడా అరెస్ట్ చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. కానీ ఫరూక్‌ను అరెస్ట్ చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

నేతల అరెస్ట్‌ను టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్అబ్దుల్లా, మెహబూబ ముఫ్తీ అరెస్ట్‌కు సంబంధించి తన వద్ద సమాచారం లేదని .. కానీ వారిని బంధించడం మాత్రం సరికాదన్నారు. వారు రాజకీయ పార్టీ నేతలే తప్ప ఉగ్రవాదులు కాదని హితవు పలికారు. ఒకవేళ వారిని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసే వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని .. అదుపులోకి తీసుకుని వ్యవస్థలను మ్యానేజ్ చేయలేరని తేల్చిచెప్పారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications