దీదీ దాదాగిరీ : సొంత ఇలాకాలో ధర్నా .. కారణమిదే ?
కోల్‌కతా : టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం, ఫైర్ బ్రాండ్ మమత బెనర్జీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో విసుగెత్తిపోయిన ఆమె .. గురువారం ఆందోళనకు సిద్ధమయ్యారు. బెంగాల్ లో నిరసన చేపడుతానని సంచలన ప్రకటన చేశారు దీదీ.

దీదీ ది ఫైర్ బ్రాండ్ ...
మమత బెనర్జీ అంటేనే ఫైర్ బ్రాండ్. అధికారంలో ఉన్నా ,లేకున్నా ఆమె మ్యానరిజం వేరు. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతన్న పరిణామాలతో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కారణమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు .. టీఎంసీ నేతలు బీజేపీలో చేరికలతో మమత మూడ్ మొత్తం మారింది. దీంతో గురువారం ధర్నా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

సీఎం ఆందోళన
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి .. తాను పాలిస్తున్న రాష్ట్రంలో ధర్నాకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. నైహతి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతానని దీదీ ప్రకటించారు. ఎన్నికలకు ముందు బీజేపీ, టీఎంసీ మధ్య చెలరేగిన హింస నేపథ్యంలో ఇళ్లు కోల్పోయిన వారికి కటట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి గూడు లేదని .. వెంటనే ఇళ్లు కట్టించాలని మమత అల్టిమేటం జారీచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో టీఎంసీ కార్యకర్తలు భయంతో వణికిపోతున్నారని .. వెంటనే వారికి తగిన న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఎక్కడ కోల్పోయామో ...
మమత ఆందోళన చేపట్టే ప్రాంతానికి కూడా ప్రాధాన్యం ఉంది. నైహతి మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు నిన్న బీజేపీలో చేరారు. దీంతో ఎక్కడ కోల్పోయామో అన్న సామెతను మమత గుర్తుతెచ్చుకున్నట్టున్నారు. ఇక్కడే ఆందోళన చేపట్టడానికి అదే కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్టీ నుంచి ఉన్న నేతలు వెళ్లేందుకు సాహసించేందుకు కూడా భయపడాలనే ధోరణిలో మమతా ఉన్నట్టు స్పష్టమవుతుంది. తన రాష్ట్రంలో మమత సీఎంగా ఆందోళనకు దిగడం చర్చానీయంశం కాగా .. ఇదివరకు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ధర్నా చేపట్టారు. అప్పుడు కేజ్రీ .. ఇప్పుడు మమత సొంత రాష్ట్రంలో ఆందోళనకు దిగి .. అందరిచూపు తమవైపు పడేట్లు చూసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications