1200 కి.మీ కాలినడకన పయనం, పోలియో సోకడంతో ఒక కాలితో, మొక్కవోని ధైర్యంతో ముందుకు..
కరోనా వైరస్ మనషులను చిన్నా భిన్నం చేస్తోంది. వైరస్ వ్యాప్తి వల్ల సకలం బంద్‌తో చిన్న, చితక వ్యాపారులకు పనిలేకుండా పోయింది. దీంతో సొంత రాష్ట్రాల బాట పడుతున్నారు. శ్రామిక్ రైళ్లు నడుపుతోన్న.. అది ఎప్పుడు వస్తుందనే ఓపిక లేక.. అప్పటివరకు జీవితం ఎలా లీడ్ చేయాలో తెలియక కొందరు కాళ్లకు పనిచెబుతున్నారు. కాళ్లు, చేతులు బాగుంటే ఫరవాలేదు.. కానీ ఓ కాలి లేని అజయ్ కుమార్ సాకెట్ మాత్రం.. ఒకటి కాదు రెండు 1200 కిలోమీటర్ల దూరంలో గల తన ఇంటికి బయల్దేరాడు. తన మొక్కవోని విశ్వసాన్ని ఇతరులకు చాటి.. సాహసయాత్రను ప్రారంభించారు.

సొంత ఊరికి...
అజయ్ స్వస్ధలం మధ్యప్రదేశ్‌లో గల సెదొల్ జిల్లా.. ఉపాధి కోసం ముంబైలో ఉంటున్నాడు. నవీ ముంబై తుర్బే ప్రాంతంలో చిన్న స్టాల్ పెట్టుకొని ఉంటున్నాడు. కానీ లాక్ డౌన్ వల్ల ఉపాధి లేదు. ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. ఎవరి వద్ద చేయిచాచని.. అజయ్, తన ఇంటికి వెళదామని అనుకొన్నాడు. మరికొందరితో కలిసి బయల్దేరారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు.. అతనిని ఇంటర్వ్యూ చేశారు. అతని నేపధ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

1200 కి.మీ పయనం..
అజయ్ కుమార్‌కు చిన్నప్పుడే పోలియో రక్కసి సోకింది. దీంతో ఓ కాలు లేదు. ఒక్క కాలు మీద, మరో భుజం కింద కర్రతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ అతని స్వగ్రామం 1200 కిలోమీటర్ల దూరంలో ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి 5 రోజుల క్రితం శ్రామిక్ రైలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వికలాంగుడినని చూపే పత్రాలను కూడా చూపించాడు. కానీ రైలు కోసం నిరీక్షించే ఓపిక లేదు. ఎందుకంటే రైలు వచ్చేవరకు తన పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం లేకపోవడంతో.. ఎలా గడుస్తుందో తెలియదు అని.. అందుకోసమే బయల్దేరానని చెప్పుకొచ్చారు.
Recommended Video

మనస్సున మరాజులు..
1200 కిలోమీటర్ల పయనం ఎలా అడిగితే.. తమ వద్ద కొన్ని బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ ఉన్నాయని చెప్పారు. దారిలో తమను ఆదుకొనే మంచి మనస్సున మనుషులు కనిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలా తమ ప్రయాణం కొనసాగి.. స్వస్థలం చేరుతుందని అజయ్ కుమార్.. ధీమా వ్యక్తం చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications