పగవాడికి కూడా రావొద్దీ కష్టాలు.. దివ్యాంగుల ఇబ్బందులు, పనిచేయని టోల్ ఫ్రీ నంబర్..
కరోనా కాలంలో సామాన్యులకే తిప్పలు తప్పడం లేదు. ఆర్థికంగా ఉన్నవారికి సమస్యలు ఉంటున్నాయి. అయితే పేద వారి సంగతి చెప్పక్కర్లేదు. ఎలాగోలా నెట్టుకొస్తారు. కాళ్లు, చేతులు ఉన్నవారి పరిస్థితి ఇలా ఉంటే మరి దివ్యాంగుల పరిస్థితి..? వారి జీవనాధారం ఎలా..? వారికి సాధక బాధలు ఎలా...? పూట ఎలా గడుస్తోంది. ఆలోచిస్తేనే ఇలా ఉంది. మరీ వాస్తవ పరిస్థితి ఎలా ఉందనే గుబులు మాత్రం ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.. పదండి.

దివ్యాంగుల వెతలు
కరోనా సమయంలో దివ్యాంగులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారు తమ బాధలను ఇండియా టుడే ప్రతినిధిని పూసగుచ్చినట్టు తెలియజేశారు. ప్రభుత్వం ఎప్పుడూ సీనియర్ సిటిజన్స్, ఇతరులు అని చెప్పిందే తప్ప తమ గురంచి మాత్రం పేర్కొనలేదని వాపోయారు. ఢిల్లీలో తన సోదరి దివ్యాంగురాలు ఉన్నారని కోల్ కతాకు చెందిన ఐటీ ఎంప్లాయ్ ఒకరు చెప్పారు. అయితే వారికి ఈ సమయంలో తగిన సౌకర్యాలు చేయలేదని చెప్పారు. కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించలేదని విరుచుకుపడ్డారు.

జ్వరం, పొడి దగ్గుతో ఇబ్బందులు
ఢిల్లీలో తన తండ్రి, సోదరి ఉంటున్నారని తెలిపారు వారికి ఒక పని మనిషి కూడా ఉండేవారు అని వివరించారు. అయితే వారిని పట్టించుకున్న నాథుడే లేడని వాపోయారు. తన సోదరికి జ్వరం, పొడి దగ్గు ఉన్న.. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తాను ఉండిపోయానని వివరించారు. సాయం కోసం హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేశానని చెప్పారు. కానీ రెండు గంటలు వెయిట్ చేయించారే తప్ప.. ప్రయోజనం లేదని చెప్పారు. తన సోదరిలా ఎందరు ఇబ్బంది పడ్డారోనని ఇప్పటికీ తనకు భయం ఉందన్నారు. వారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉందన్నారు. ఆ భగవంతుడి దయ వల్ల తన సోదరి బాగుందని.. రోజు తనతో వీడియో కాల్ మాట్లాడుతున్నానని చెప్పారు.

ఇవే నంబర్లు.. కానీ పనిచేయలే
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక శ్రద్ద కనబరిచింది. 1075, 011-23978046, 9013151515 నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. దివ్యాంగులకు ఆడియో టేపు, బ్రెయిలీ లిపీ తర్వాత.. తమ సొంత భాషలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని కేంద్ర సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ తెలిపింది. క్వారంటైన్ సమయంలో అత్యవసర సేవలు, వ్యక్తిగత సాయం కోసం చర్యలు తీసుకున్నామని వివరించింది. కంటిచూపులేని వారు.. నడవలేని వారి పరిస్థితి కోసం క్రియేట్ చేశామని తెలిపారు.

ఇంట్లో వస్తువులు చిందర వందర
ఇదేవిధంగా బెంగాల్‌కు చెందిన స్నేహ స్మితా కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. తన సోదరుడు కూడా దివ్యాంగుడు అని.. మానసికంగా బాగోలేడని చెప్పారు. అతను బయటకు వెళ్లేందుకు ఉత్సాహం చూపించేవాడు అని.. కానీ ఈ పరిస్థితుల్లో అలా వెళ్లే సాహసం చేయలేదని చెప్పారు. దీంతో అతను చిరాకుగా ఉండేవాడని తెలిపారు. ఇంట్లో చిందర వందర చేసేవాడని వివరించారు. దీంతో సరిగా తినేవాడు కూడా కాదని చెప్పారు. ఇదీ అతని ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెప్పారు. ఇదివరకు తన తండ్రి నిత్యావసర సరుకులు తెచ్చేవాడు అని.. ఇప్పుడు తానే ఆ పనిచేస్తున్నానని చెప్పారు. అతని ఆరోగ్యం సరిగా లేదని.. అందుకే తాను బయటకు వెళుతున్నానని చెప్పారు. తాను చదువుకుంటూనే.. ఇంటి అవసరాలను తిర్చేదానినని చెప్పుకొచ్చారు. ఇదీ కాస్త ఇబ్బంది కలిగిందించని తెలిపారు.

నిద్రలేని రాత్రులు
దివ్యాంగులు పేరంట్స్ కరోనా కాలంలో ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారు. దివ్యాంగుల గురించి రాష్ట్రాల వద్ద డేటా లేకపోవడం ఇబ్బంది కలిగించిందని చెప్పారు. మరోవైపు పుణెకు చెందిన సోనాలి దంపతులకు కూడా దివ్యాంగుడైన కుమారుడు ఉన్నారు. వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతని చూడటం ఇబ్బంది కలిగించింది. కుమారుడు తమ వద్దకు రానీచ్చేవారం కాదని చెప్పారు. కానీ అతనికి అర్థం కాక వచ్చేవారు అని తెలిపారు. బాల్కనీ నుంచి వస్తువులను బయటకు విసిరేసేవారు అని చెప్పారు. సరిగా తినకపోవడంతో.. తమకు మానసిక వేదన కలిగిందని వివరించారు.












Click it and Unblock the Notifications