జైల్లో శశికళ ఎఫెక్ట్: బదిలి, ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ బెదిరింపులు: డీఐజీ రూప !
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని అవ్యవహారాలు బయటపెట్టిన కర్ణాటక, తమిళనాడు ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చిన ఐపీఎస్ మహిళా అధికారి, డీఐజీ రూప సోషల్ మీడియాలో పరోక్షంగా తన బదిలి విషయంపై ప్రభుత్వం.
బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని అవ్యవహారాలు బయటపెట్టిన కర్ణాటక, తమిళనాడు ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చిన ఐపీఎస్ మహిళా అధికారి, డీఐజీ రూప సోషల్ మీడియాలో పరోక్షంగా తన బదిలి విషయంపై ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేశారు.
న్యాయం ఎక్కడ ఉంటుందో ఆ న్యాయానికి బెదిరింపులు అక్కడే ఉంటాయని చెప్పిన అమెరికా మావవహక్కుల పోరాట వీరుడు మార్టీన్ లూథర్ కింగ్ వ్యాఖ్యలను ట్వీట్టర్ లో పోస్టు చేసి కర్ణాటక ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ట్వీట్టర్ లో ఆ ట్యాగ్ చూసిన అనేక మంది నెటిజన్లు డీఐజీ రూపకు మద్దతుగా నిలిచారు.
— D Roopa IPS (@D_Roopa_IPS) July 18, 2017
అనేక మంది మేడమ్ మీ లాంటి ధైర్యవంతులు ఈ దేశానికి చాల అవసరం, మీలాంటి నిజాయితీ ఉన్న అధికారులకు ఇలాంటి కష్టాలు తప్పవు, మీరు ధైర్యంగా ఉండండి, ప్రజలే మీకు అండగా ఉంటారని డీఐజీ రూపకు ధైర్యం చెబుతున్నారు.
తనకు అండగా నిలిచిన వారికి రూప ధన్యవాదాలు చెప్పారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అక్రమాలను రెండు సార్లు నివేదిక తయారు చేసి పై అధికారులు, ప్రభుత్వానికి లేఖ రాసిన రెండు రోజుల్లోనే జైళ్ల శాఖ డీఐజీగా ఉన్న రూపను ట్రాఫిక్ విభాగం డీఐజీగా బదిలి చేశారు.
Respected Mam..Your braveness and courage will serve as inspiration to many, just like respected #KiranBediji.
— Arif Maghribi (@DrKashmirM) July 18, 2017
God bless you always.
అధికారులను బదిలి చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని, తనను బదిలి చేసినందుకు ఎలాంటి బాధ లేదని రూప చెప్పారు. అయితే ప్రభుత్వ తీరును ఎండగడుతూ డీఐజీ రూప సోషల్ మీడియాలో తన బదిలి విషయంలో అసహనం వ్యక్తం చెయ్యడంతో ఆమెకు అనేక మంది మద్దతు ఇస్తున్నారు.
I am also struggling alone for Justice.Corruption has occupied the whole system.I am suffering a lot n will die without getting Justice :-( pic.twitter.com/zDYn7JFo1m
— VADIRAJU HM (@VADIRAJUHM) July 18, 2017
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications